మాజీ ముఖమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ) శతదినోత్సవ వేడుకలకు సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరవడం రాజకీయంగా ప్రదాన్యం సంతరించుకుంది.అంతేకాకుండా ఆ వేడుకలో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.
రాజకీయంగా మాట్లాడకూడదని అంటూనే ఆయన చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ హీట్ పెంచుతున్నాయి.టీడీపీ అధినేత చంద్రబాబుతో తనకున్న స్నేహాన్ని ప్రస్తావిస్తూ ఆయన పై ప్రశంశల వర్షం కురిపించారు రజినీకాంత్.
చంద్రబాబు( Chandrababu ) గొప్ప విజినరీ లీడర్ అని.హైదరబాద్ లో ఐటీరంగం అభివృద్దిలో చంద్రబాబు కృషి ఎంతో ఉందని, 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు రజినీకాంత్.

అయితే ఎన్టీ రామారావు శతదినోత్సవ వేడుకలో( centenary celebration ) రజినీకాంత్ చంద్రబాబుపై ప్రశంశలు కురిపించడం, అలాగే ప్రస్తుత రాజకీయాలను నొక్కి చెప్పడంతో రజినీ రాక వెనుక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా అనే చర్చ జోరుగా సాగుతోంది.సినీతారాలను రాజకీయంగా వాడుకోవడం చంద్రబాబు మొదటి నుంచి అనుసరిస్తున్న వ్యూహం.పార్టీకి బలం తగ్గిన ప్రతిసారి సినీతారలను రంగంలోకి దించుతారు చంద్రబాబు.గతంలో 2009 ఎన్నికల సమయంలో జూ.ఎన్టీఆర్ తో ప్రచారం చేయించి పార్టీ క్యాడర్ లో మంచి జోష్ నింపారు.ఇక నందమూరి బాలకృష్ణ గ్లామర్ పార్టీకి ఎలాగూ ఉండనే ఉంది.
అలాగే నారా రోహిత్, నందమూరి కళ్యాణ రామ్, ఇలా ప్రతి ఒక్కరినీ రాజకీయంగా పార్టీ ప్రచారల్లో దింపిన ఘనత చంద్రబాబుకు ఉంది.

అయితే ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో ఒక్క బాలకృష్ణతో తప్పా మిగిలిన వారంతా కూడా చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు.ముఖ్యంగా జూ.ఎన్టీఆర్ టీడీపీ కార్యకలాపాలకు చాలా దూరం వహిస్తున్నారు.దాంతో టీడీపీలో జూ.ఎన్టీఆర్( Jr Ntr ) తిరిగి యాక్టివ్ కావాలని, ఆయన వస్తేనే పార్టీకి మైలేజ్ పెరుగుతుందని సొంత పార్టీ క్యాడర్( Party cader ) లోనూ అలాగే ప్రజల్లోనూ ఓ వాదన నడుస్తోంది.ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ కు సంబంధించిన అంశం చంద్రబాబును ఎప్పటినుంచో ఇబ్బందికి గురి చేస్తూనే ఉంది.ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించాలన్నా, పార్టీ క్యాడర్ లో జోష్ నింపాలన్నా సినీ గ్లామర్ ఎంతైన అవసరం.అందుకే చంద్రబాబు రజినీకాంత్ ను రంగంలోకి దించినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా రజినీకాంత్ తో వచ్చే ఎన్నికల సందర్భంగా ప్రచారంలో దించిన ఆశ్చర్యపోనవసరం లేదనే మాట కూడా వినిపిస్తోంది.ఇటు రజినీకాంత్ రాక ను వైసీపీ తీవ్రంగా తప్పుబడుతూ విమర్శలు ఎక్కుబెడుతోంది.
మొత్తానికి రజినీ రాకతో ఏపీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయనే చెప్పవచ్చు.