చంద్రబాబు భారీ స్కెచ్.. అయిన టీడీపీకి ఇబ్బందే !

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు.అందుకోసం అధికార వైసీపీని దెబ్బ తీసేందుకు ఏ చిన్న అవకాశం దొరికిన వదలడం లేదు.

 Chandrababu's Big Plan,chandrababu Naidu, Tdp 2024 Elections, Ap Govt , Ycp, Am-TeluguStop.com

ఇప్పటికే నిత్యం ప్రజల్లో ఉంటూ బహిరంగ సభలు పర్యటనలు చేస్తున్న బాబు.ఇక నియోజికవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు.

ముఖ్యంగా వైసీపీ నేతలు బలంగా ఉన్న నియోజిక వర్గాలపై పట్టు సాధిస్తే.మిగిలిన నియోజిక వర్గాలలో తిరుగుండదనేది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది.

అందులో భాగంగానే సత్తెనేపల్లి నియోజిక వర్గ ఇంచార్జ్ గా కన్నా లక్ష్మి నారాయణను నియమించారు చంద్రబాబు.కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ నియోజిక వర్గంలో కన్నా లక్ష్మినారాయణకు ప్రజల్లో మంచి ఆదరనే ఉంది.

Telugu Ambati Rambabu, Ap, Chandrababu, Kodela Sivaram, Tdp, Ys Jagan-Politics

ప్రస్తుతం ఈ నియోజిక వర్గంలో వైసీపీ నేత ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.చంద్రబాబును ఇరకాటంలో పెట్టడంలోనూ, టీడీపీ నేతలపై ఘాటైన విమర్శలు చేయడంలోనూ అంబటి రాంబాబు ముందుంటారు.అలాంటి అంబటిని ఎదుర్కోవాలంటే కన్నా లక్ష్మినారాయణతోనే సాధ్యం అనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.అయితే కన్నా లక్ష్మినారాయణను సత్తెనపల్లి నియోజిక వర్గ ఇంచార్జ్ గా నియమించడాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేక పోతున్నారు.

ముఖ్యంగా కోడెల శివప్రసాద్ కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.ఎందుకంటే గతంలో ఈ నియోజిక వర్గానికి కోడెల శివప్రసాద్ ప్రాతినిథ్యం వహించారు.అయితే ఆయన మరణాంతరం.కోడెల కుటుంబానికి టిడీపి పార్టీ తగిన ప్రదాన్యం ఇవ్వడం లేదని ఆయన కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు.

Telugu Ambati Rambabu, Ap, Chandrababu, Kodela Sivaram, Tdp, Ys Jagan-Politics

ఈ నేపథ్యంలో కోడెల కుటుంబానికి కాకుండా కన్నా లక్ష్మినారాయణ( Kanna Lakshminarayana )ను సత్తెనపల్లి ఇంచార్జ్ గా నియమించడాన్ని.కోడెల కుటుంబం తీవ్రంగా తప్పుబడుతోంది.కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం మాట్లాడుతూ.ఈ మూడేళ్ళ కాలంలో చంద్రబాబుతో మాట్లాడడానికి చాలా ట్రై చేశామని, ఆయన ఐదు నిముషాలు కూడా టైమ్ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు.

ఏదైనా నియోజిక వర్గంలో నాయకుడు చనిపోయాక పార్టీ కోసం కష్టపడిన వారిని గౌరవైంచే టిడీపి.మా కుటుంబానికి ఎందుకు అన్యాయం చేస్తోందని వాపోయారు కోడెల శివరాం.ప్రస్తుతం శివరాం చేసిన వ్యాఖ్యలు నియోజిక వర్గంలో టిడీపిపై గట్టిగా ప్రభావం చూపే అవకాశం ఉందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.మొత్తానికి సత్తెనపల్లిలో అంబటికి చెక్ పెట్టాలని కన్నా లక్ష్మినారాయణను రంగంలోకి దింపిన బాబుకు.కోడెల కుటుంబం నుంచి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube