ఈ నెల 12వ తేదీన ఏపీ సీఎంగా చంద్రబాబు( AP CM Chandrababu ) ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ మేరకు టీడీపీ ( TDP ) శ్రేణులు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రమాణస్వీకార మహోత్సవానికి కావాల్సిన సామాగ్రి దాదాపు యాభై లారీల్లో తరలివెళ్తుంది.రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఈ యాభై లారీలను నిలిపారు.
కాగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం రాయపూడి( Rayapudi ) లేదా ఉద్దండ్రాయునిపాలెంలో నిర్వహించే అవకాశం ఉంది.కాగా ఈ ఏర్పాట్లను హైదరాబాద్ కు చెందిన ఆర్కే ఈవెంట్స్ నిర్వహిస్తోంది.
కాగా తాజా ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి భారీ మెజార్టీ సాధించడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందన్న సంగతి తెలిసిందే.