రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్..: తెలంగాణ ఎంపీ బండి సంజయ్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ స్పందించారు.రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిపారు.

తప్పు చేస్తే అరెస్ట్ చేయడాన్ని ఎవరూ కాదనరన్న బండి సంజయ్ ఎఫ్ఐఆర్ లో పేరు లేని వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.అభివృద్ధి, సంక్షేమం కోసం రాజకీయాలు చేయాలని కానీ కక్ష సాధించేందుకు రాజకీయాలు చేయడం సరికాదన్నారు.జీ20 సమావేశాలు జరుగుతున్నప్పుడే అరెస్టుకు సమయం కుదిరిందా అని నిలదీశారు.ప్రజల్లో చంద్రబాబుకు మైలేజ్ వచ్చిందన్నారు.

వైసీపీది తప్పంటే చంద్రబాబు ఏజెంట్, పవన్ ఏజెంట్ అంటున్నారని మండిపడ్డారు.అయితే ఏపీ ప్రభుత్వం తీరు పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని బండి సంజయ్ వెల్లడించారు.

ఆ థియేటర్ లో 200 రోజులు ఆడిన గుంటూరు కారం.. మహేష్ ఖాతాలో మరో రేర్ రికార్డ్!
Advertisement

తాజా వార్తలు