గంటా రూటు ఒంగోలు వైపు??

విశాఖ జిల్లాలో తెలుగు దేశానికి ఉన్న బలమైన నేతల్లో గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao ) ఒకరు .తన గెలుపే కాకుండా తన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల ఫలితాలను కూడా డిసైడ్ చేసే స్థాయి ఆయనది .

 Chandrababu Wants To Shift Ganta To Ongole , Ganta Srinivasa Rao, Tdp , Ycp, On-TeluguStop.com

తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రలో ట్రబుల్ షూటర్ గా కూడా ఆయన వ్యవహరిస్తుంటారు.ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశానికి మంచి ఫలితాలు రావడానికి వెనక గంటా చక్రం తిప్పడమే కారణం అంటారు.

అయితే ఆయన వల్ల ఒక నష్టం కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది.అక్కడ అయ్యన్న తో వైరం గంటాకు ఇబ్బందికరంగా మారింది.మంత్రి పదవుల విషయంలోనూ పరిపాలన సంబంధిత విషయాల లో కూడా గంటా తో అయ్యన్నకు ఉన్న వైరం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది .ఈ వర్గ పోరును అరికట్టాలంటే గంటా ను జిల్లా మార్చడమే మార్గమని భావిస్తున్న తెలుగుదేశం( TDP ) అధిష్టానం ఆయనను ఒంగోలు నుంచి పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తుందని వార్తలు వస్తున్నాయి.

Telugu Ap, Chandrababu, Gantasrinivasa, Ongole-Telugu Political News

ఒంగోలు( Ongole ) నుంచి పోటీ చేయడం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వానికి రెండు ప్రయోజనాలు ఉంటాయి.ఒకటి ఆయనను ఎంపీగా పోటీ చేయించి ఢిల్లీకి పంపించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల నుంచి దూరంగా ఉంచడం ఒక కారణం అయితే గంటా వంటి బలమైన నేత ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఆ పార్లమెంటు పరిదిలో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆర్థిక ఆసరాతో పాటు నైతిక మద్దతు కూడా ఉంటుందని, కాపు సామాజిక వర్గంలో బలమైన నేతైన గంట శ్రీనివాసరావు రాకతో ఒంగోలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ వాతావరణాన్ని ఏర్పడుతుందనే అంచనాలతో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లుగా తెలుస్తుంది .నిజానికి ఒంగోలు ప్రాంతం గంటాకు సొంత ప్రాంతం, అక్కడ టంగుటూరు ఆయన స్వస్థలం.ఆయన డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నారు.

వ్యాపార అవసరాల కోసం వైజాగ్ షిఫ్ట్ అయ్యి అక్కడే స్థిరపడి బలమైన నేతగా కొనసాగుతున్నారు.

Telugu Ap, Chandrababu, Gantasrinivasa, Ongole-Telugu Political News

అయితే తనకు అనుకూల ప్రాంతమైన విశాఖపట్నం ను వదిలి వెళ్ళడానికి గంటా శ్రీనివాసరావు ఒప్పుకుంటారా? లేదా అన్నది ప్రశ్నగా మారింది.అయితే విశాఖపట్నం జిల్లాలో అనేక నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన చరిత్ర కూడా ఆయనకు ఉంది, అయితే ఇంత తక్కువ సమయం లో తన అనుకూల ప్రాంతాన్ని వదిలి ఒంగోలు కు వెళ్ళడానికి ఆయన ఎంత మేరకు సుముఖం గా ఉంటారో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube