మిల్కీ బ్యూటీ తమన్నా( milky buty tamannaah ) ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతోంది.ఒక దశాబ్దం పాటు ఈమె హవా కొనసాగింది.
కెరీర్ ఆరంభంలో నిరాశ పర్చింది… గత కొన్నాళ్లుగా యంగ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకోలేక పోతుంది.దాంతో ఈ అమ్మడి కెరీర్ ఖతం అయినట్లే అంటూ అంతా భావిస్తున్నారు.
కానీ తమన్నా మాత్రం చాలా తెలివిగా వ్యవహరిస్తోంది.గత కొన్నాళ్లుగా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను కూడా కాదనకుండా చేస్తోంది.
చివరకు మ్యూజిక్ ఆల్బం లో కూడా తమన్నా నటించింది.ఐటం సాంగ్స్ ( Item Songs )లో చిన్న పాత్రల్లో… చిన్న హీరోల సినిమాల్లో సిరీస్ లో ఇలా అన్నింట కూడా సందడి చేస్తూనే ఉంది.

తాజాగా ఈ అమ్మడి యొక్క జోరు సోషల్ మీడియాలో తెగ కనిపిస్తోంది.ఆకట్టుకునే రూపం ఈ అమ్మడి సొంతం.కెరీర్ ఆరంభం నుండి కూడా తమన్నా యొక్క అందాల ఆరబోత ఫోటో లు మనం చూస్తూనే ఉన్నాం.ఇప్పుడు అదే ఫోటోలతో తమన్నా తన యొక్క కెరీర్ ను సాగిస్తోంది.
ఈ మధ్య కాలంలో తమన్నా తన స్కిన్ షో ప్రతిభ పెంచింది.బాబోయ్ ఇంతటి అందం ఏంటి అన్నట్లుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

వయసు మూడు పదుల వయసు దాటినా కూడా తమన్నా అందాల ఆరబోత పెరిగిందే కానీ తగ్గలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.వయసు పెరిగినా కొద్ది కొంత మంది హీరోయిన్స్ కు ఆఫర్లు తగ్గుతూ ఉంటాయి.అందుకే ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తూ తన యొక్క ఇమేజ్ ను కాపాడుకుంటూ ఉంది.అంతే కాకుండా ఆకట్టుకునే ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ మళ్లీ మళ్లీ నిరూపించుకుంటూనే ఉంది.
మిల్కీ బ్యూటీ తమన్నా యొక్క స్కిన్ షో కారణంగా ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్( Chiranjeevi Bhola Shankar ).రజినీకాంత్ జైలర్ సినిమా లతో పాటు మరి కొన్ని సినిమాల్లో నటించే అవకాశాలు కూడా దక్కించుకుంది.మరో పదేళ్ల పాటు ఈ అమ్మడి కెరీర్ కుమ్మేయడం ఖాయం.







