టీడీపీ అధినేత చంద్రబాబు రేపు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు రెడీ అయ్యారు.రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బాదుడే బాదుడు అనే పేరిట వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో పొందూరు మండలం దల్లవలస గ్రామంలో చంద్రబాబు పర్యటించబోతున్నారు.సాయంత్రం నాలుగు గంటల నుండి చంద్రబాబు గ్రామంలో ప్రతి గడపగడపకు వెళ్లి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
అనంతరం సాయంత్రం భారీ బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్.ఇంకా నిత్యావసర సరుకులు పెంపు.
ఆర్టీసీ చార్జీల పెంపునకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు.అనంతరం గ్రామంలో బడుగు బలహీన వర్గాల ప్రజలతో కలసి చంద్రబాబు భోజనం చేయనున్నారు.
దీంతో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.