ఈ ప్రభుత్వమైనా రాజధాని నుంచే పరిపాలన సాగిస్తుంది.కాని ఆంధ్రప్రదేశ్ సర్కారు మాత్రం రెండు నగరాల నుంచి పాలన చేస్తోంది.
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి, ఎపీలోని విజయవాడ నుంచి పాలన చేస్తుంది.ఇలా ఎందుకు చేయాల్సి వస్తున్నదో జనానికి తెలిసిందే.
వాస్తవానికి ఏపీలో రాజధాని నిర్మాణం పూర్తైన తరువాత హైదరాబాద్ నుంచి కార్యాలయాలు తరలించాలి.కాని తెలంగాణా ముఖ్యమంత్రితో చంద్రబాబుకు కొట్లాటలు వస్తున్నాయి.
ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కూడా బాబు ఆరోపించారు.ప్రతి రోజు తలనోప్పిగానే ఉంది.
దీన్ని వదిలించుకోవడానికి ఎక్కువ కార్యాలయాలను, ఉద్యోగులను తరలించాలని బాబు నిర్ణయించారు.తనతో సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా వారంలో సగం రోజులు విజయవాడ నుంచే పనిచేయాలన్నారు.
క్యాంపు కార్యాలయాల కోసం, ఆఫీసుల కోసం భవనాలు వెదుకుతున్నారు.బాబు ఇదివరకే విజయవాడ నుంచి పనిచేయడం ప్రారంభించారు.
గతంలో క్యాంపు కార్యాలయం కోసం భవనం చూసారు.తానొక్కడే విజయవాడలో వారంలో సగం రోజులు ఉండాలని అనుకున్నారు.
కాని ఇప్పుడు సీఎస్ ఆఫీసు సహా అన్ని ఆఫీసులు తరలించాలని ఆదేశించారు.దీనివల్ల బాబుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.
కాని పిల్లా జెల్లా ఉన్న ఉద్యోగులకు ఇబ్బంది.విజయవాడ నుంచి పని చేస్తామంటే హైదరాబాదును వదులుకుంటాం అని అర్ధం కాదు అని బాబు అన్నారు.
సచివాలయం హైదరాబాద్ నుంచే పని చేస్తుందని చెప్పారు.ఇప్పటికే విశాఖ, రాజమండ్రి, విజయవాడల్లో మంత్రివర్గ సమావేశాలు నిర్వహించారు.
ఇక ముందు దాదాపు అన్ని క్యాబినెట్ సమావేశాలు రాజధాని ప్రాంతంలోనే నిర్వహిస్తామన్నారు.ఎపీకి హైదరాబాదు దూర ప్రాంతమని, అందుకే పరిపాలన విజయవాడ నుంచి సాగాలని చెప్పారు.
కార్యాలయాల తరలింపు మంచిదే.ఉద్యోగులు ఇప్పటినుంచి అలవాటు పడతారు.
.