యూపీఏ ప్రభుత్వం ఆధార్ కార్డు విధానం ఏ ముహూర్తాన ప్రవేశ పెట్టిందో గాని అది ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది.ఒక విధానం సరిగా అమలు చేయలేనప్పుడు దాన్ని ఆపెయడమే మంచిది.
ప్రతి పనికి ఆధార్ కార్డు ఉండాలని, ప్రభుత్వ పధకాల కింద ప్రయోజనం పొందాలంటే ఆధార్ ఉండాలని అధికారులు ఆంక్షలు పెడుతున్నారు.ఇప్పటికీ అనేక మందికి ఆధార్ కార్డులు లేవు.
ఆధార్ కార్డు లేకపోతె వారు బతికి ఉన్నా చనిపోయినట్లే పరిగణిస్తున్నారు.ఈ నేపధ్యంలో సుప్రీం కోర్టు మంగళవారం కీలకమైన తీర్పు ఇచ్చింది.
ప్రభుత్వ పధకాలకు ఆధార్ ఉపయోగించవచ్చు.కాని ఆధార్ తప్పనిసరి కాదు అని స్పష్టం చేసింది.
దీనిపై జనంలో ప్రచారం చేయాలని కూడా చెప్పింది.ఈ తీర్పు ఇచ్చింది రాజ్యాంగ ధర్మాసనం కాబట్టి ప్రభుత్వాలు దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి.
ఆధార్ కార్డుల ద్వారా వ్యక్తుల వ్యక్తిగత సమాచారం బహిర్గతం అవుతున్నదని జనం ఆందోళన చెందుతున్నారు.అందుకే సుప్రీం కోర్టు ఆధార్ కార్డులోని సమాచారం మరి ఏ ఇతర ప్రయోజనాలకు వాడుకోవద్దని ఆదేశించింది.
ఆధార్ గొడవ ఎంత తొందరగా వదిలితే అంట మంచిదని ప్రజలు భావిస్తున్నారు.సుప్రీం కోర్టు తీర్పు ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు.







