కర్నూలు జిల్లా ఆలూరు సభలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) కర్నూలు జిల్లా( Kurnool District ) ఆలూరులో "ప్రజాగళం" నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పై( CM Jagan ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

జగన్ లాంటి వ్యక్తి కన్నతల్లికి, జన్మభూమికి భారమని ఎద్దేవా చేశారు.ఏపీలో అత్యంత డబ్బు ఉన్న వ్యక్తి జగన్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

జగన్ మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందని విమర్శించారు.ఐదేళ్లు అధికారమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు.

అన్ని రంగాలను వ్యవస్థలను ధ్వంసం చేశారని మండిపడ్డారు.జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితికి ఆర్థిక వ్యవస్థను తీసుకువచ్చారని ఆరోపించారు.వైసీపీని( YCP ) చిత్తుచిత్తుగా ఓడించేందుకు పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమి( NDA Alliance ) అని.కేంద్ర సహకారం రాష్ట్రానికి అవసరమని చంద్రబాబు సంచలన స్పీచ్ ఇచ్చారు.ఏపీలో ఎన్నికలకు ఇంకా పాతిక రోజులు మాత్రమే సమయం ఉంది.ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది.2024 ఎన్నికలలో కచ్చితంగా గెలవాలని చంద్రబాబు పక్క వ్యూహాలతో నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.

గతంలో 2014లో ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి రావడం జరిగాయి.ఈసారి కూడా ఆ తరహాలోనే విజయం సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు