తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu ) “ప్రజాగళం” పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో శుక్రవారం నరసాపురంలో “ప్రజాగళం”( Prajagalam ) బహిరంగ సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వెంటనే “వర్క్ ఫ్రం హోం”( Work From Home ) విధానం ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.ఇదేమీ కష్టమైన విధానం కాదని అన్నారు.
ఇప్పటికే గ్రామాలలో చాలా చోట్ల ఇంటి వద్ద నుండే పనిచేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు.దీంతో అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ మండల కేంద్రాలలో వర్క్ స్టేషన్ లు నిర్మించి.
ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొచ్చి.మీరు డబ్బులు సంపాదించుకునే మార్గం చూపించే బాధ్యత తాము తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇక ఇదే సమయంలో కష్ట సమయంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలను ఎన్నటికీ మర్చిపోనని అన్నారు.అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పొత్తులు పెట్టుకుని సీట్లు పంచినా కార్యకర్తలు మాత్రం పార్టీ జెండాలు( Party Flags ) మోస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు.అధికారంలోకి వచ్చిన వెంటనే నాయకులకు కార్యకర్తలకు తగిన గుర్తింపు న్యాయం చేసే బాధ్యత తనది అని చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది.కచ్చితంగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రభుత్వం స్థాపిస్తామని స్పష్టం చేశారు.
తన ప్రాణ సామాన్యులైన కార్యకర్తల త్యాగం వృధా కానివ్వనని అందరికీ అండగా ఉంటానని చంద్రబాబు తెలియజేశారు.