రాజన్న సిరిసిల్ల:లక్షల టన్నుల ధాన్యం పండించిన అనుభవం ఉన్న కరీంనగర్ నేడు ఎడారిగా మారింది.ఆనాడు మిడ్ మానేరు సముద్రం లాగా ఉండే ఇప్పుడు ఎండిపోయింది.2014 ముందు గోస ఉండె, మళ్లీ అదే గోస కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో.పంటలు ఎండని, మోటర్లు కాలనీ జిల్లా లేదు, ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలించే పరిస్థితి వచ్చింది, అసమార్ధులు.
చవటలు రాజ్యాన్ని నడుపుతున్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్( KCR ) అన్నారు.శుక్రవారం మాజీ సీఎం కేసీఆర్ రాజన్న జిల్లాలో పర్యటించారు .రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.ఎండిపోయి బీటలు వారిన మిడ్ మానేరు పరిశీలించారు.
అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ కు ఐదు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు టౌన్ లో జరిగిన సమావేశంలో చెప్పిన కాలేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ చేసినాం కరీంనగర్ కి ఇక డొకా ఉండదు.నిరంతరం జిల్లాను కాపాడే నాలుగు సజీవ జలదారులను సృష్టించామని, దీనిని కరీంనగర్ ప్రజలు కనులారా చూసినారని అన్నారు.
అప్పర్ మానేరు ప్రాజెక్టు నుండి మానేరు వాగు పై అన్నారం బ్యారేజీ వరకు చెక్ డ్యాములు నిర్మించడంతో సజీవ జలంతో కళకళలాడుతుండదని అన్నారు.
వరద కాలువ ను పూర్తిచేసి రిజర్వాయర్ గా మార్చి నా మనీ, కాకతీయ కాలువ 10 నుండి 11 నెలలు నిండు గర్భిణిగా ప్రవహించేదని, అన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అసమర్ధుల పాలనలో మిడ్ మానేరు ఎండిపోయిందని, లోయర్ మానేరులో నీరు లేక కరీంనగర్ పట్టణ ప్రజలకు రెండు రోజులకోసారి మంచినీళ్లు వస్తున్నాయని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల నుంచి 20 లక్షల మధ్య పంటలు ఎండిపోయాయని ,నీటి నిర్వహణ సామర్థ్యం ఇలా నిర్వహించాలో తెలవక, కరెంటు సక్రమంగా ఇవ్వక మోటార్లు కాలిపోయి పంటలు ఎండిపోయాయని ,ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమైన అని అన్నారు.
వర్షపాతం లోటు తో కరువు వచ్చిందని మంత్రులు అంటున్నారని, కా ని తెలంగాణలో అధిక వర్షపాతం నమోదు అయిందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల పెట్టుబడి పెట్టి రైతులు గంగపాలయ్యారనీ, రైతుబంధు ఎప్పుడు ఇస్తారో తెలువదని, అది వస్తదో రాదో తెలవదు అని రైతులు బాధపడుతున్నారని అన్నారు.100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు చనిపోయారని, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నలభై ఎనిమిది గంటల్లో చనిపోయిన రైతుల లిస్టు ఇవ్వమంటే నాలుగు గంటల్లోనే ఇచ్చినామని, చనిపోయిన రైతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, లేకుంటే రైతుల ఉసురు ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుందని అన్నారు, సూర్యాపేట కు పంట పరిశీలనకు వెళితే నేను పోయిన వెంటనే నీళ్లు వదిలిరు, సాగర్ లో డెడ్ స్టోరేజ్ మీద కన్నా 14 టీఎంసీల నీళ్లు ఉన్నాయని,ఇప్పుడు లెఫ్ట్ కెనాల్ కు నీళ్లు వదులుతున్నారని, కూలిపోయింది అన్న కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు వదులుతున్నారని, గత 20 రోజులు ముందే నీళ్లు వదిలి ఉంటే ప్రతి గ్రామములో పంటలు ఎండిపోకుండా ఉండేదని, సమయానికి నీళ్లు వదలక, కరెంటు ఇవ్వక రైతుబంధు ఇవ్వక ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.
ప్రజలందరూ రుణాలు తీసుకోరి, డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తా అని చెప్పిన సీఎం, డిసెంబర్ 9 పోయి ఏప్రిల్ 9 వచ్చింది రైతు రుణమాఫీ, బ్యాంకులు వచ్చి రైతులకు నోటీసులు ఇస్తున్నారని అన్నారు.
ప్రభుత్వం వెర్రి తిరిగి వేషాల కారణంగా తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుందని అన్నారు.తెలంగాణలో పండిన ప్రతి పంటను కొన్నాలని, ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారని, అని జొన్న పంటలు సగమే కొంటున్నారని, మొత్తం జొన్న పంటను కొన్ని క్వింటాలుకు 500 బోనస్ ఇవ్వాలని, ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు.
బోనస్ కీ సంబంధించి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ప్రభుత్వం తీసుకోవాలని, తీసుకొని బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.నాలుగు నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం చేశారని, గొర్రెల పంపిణీ, దళిత బంధు మీద ఉలుకు లేదు పలుకు లేదని, ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలంతా నిలదీయాలని అన్నారు.
దళితులు యాదవులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.తులం బంగారం ఇస్తామన్నారు, ఇప్పటివరకు తులం బంగారం ఇవ్వలేరు, ఆసరా పింఛను 200 నుండి రెండు వేలకు చేసి ఇంటికి ఒకరికి ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున ఇంట్లో ఇద్దరికీ ఇస్తామన్నారని ఇప్పటివరకు ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదని అన్నారు.
ఇచ్చిన మాటలేగా ఎగపెట్టి, రెపరండం అంటున్నారని అన్నారు.ప్రతి వృద్ధాప్య పింఛను దారానికి ప్రభుత్వం ఇప్పటివరకు 24వేల ఏగకొట్టారని అంత ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు.సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్య నివారణ కోసం ఆనాడు బీ ఆర్ఎస్ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలతో ట్రస్ట్ ఏర్పాటు చేశామని, ఆనాడు కార్మికల ను ఆ దుకోవడానికి బిక్షాటన చేశామని అన్నారు.
సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవటానికి బతుకమ్మ చీరలతో పాటు ఇతర ఆర్డర్లు ఇచ్చి ఇక్కడి నేతన్నల ఆత్మహత్యలు నివారించామని ,ఈ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ల పొట్టకొట్టే విధంగా ఆర్డర్లు బంద్ పెట్టింది అని, దీంతో మళ్లీ నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు.
ఓవరీస్ స్కాలర్ షిప్ లు బంద్ పెట్టిన్రు, బడి పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ ను కూడా బంద్ పెట్టిన్రు, ముఖ్యమంత్రి డబ్బులు ఎవరికీ ఇస్తున్నాడు అని అన్నారు.రైతుబంధు( Rythu Bandhu) అడిగితే ఓ మంత్రి చెప్పుతో కొట్టుమంటాడు, నేతన్నలను ఆదుకోమంటే నిరోధ్ లు, పపడాలు అమ్ముకోమంటారా, చేనేత కార్మికులు ఎలా కనిపిస్తున్నారు అని ప్రశ్నంచారు.
చేనేత బకాయిలు వెంటనే చెల్లించాలని బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకుంటే కోర్టులో పిటిషన్ వేస్తామని అన్నారు.చేనేత కార్మికులు దొబ్బి తిన్నారు అని అంటార్రు, అమలు కాని వాగ్దానాల కారణంగా కాంగ్రెస్ కి స్వల్పంగా ఓట్లు ఎక్కువ వచ్చినాయని అన్నారు.మీరు ఇచ్చిన హామీలతో అన్ని వర్గాలు ప్రజలు మోసపోయారని ,ఒక్క ఏడాదిలోనే మీ రంగంతా బయటపడతద అని అన్నారు.9 ఏళ్లు మేము కరెంట్ వ్యవస్థను బ్రహ్మండంగా నడిపినం,మీ అసమర్ధత కారణంగానే విద్యుత్ కోతలు ఉన్నాయని అన్నారు.ఇది మనుషులు సృష్టించిన కృత్రిమ కరువు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే అని అన్నారు.ఈ రాష్ట్రం బలమైన వ్యవసాయ రాష్ట్రం కావాలని మేము పట్టుబట్టినామని,రైతులకు డబ్బులు సాయం చేస్తే మేలు అవుతుందని వ్యవసాయ నిపుణుడు అశోక్ గులాటి చెప్పాడంతో రైతు బందు పథకం ప్రారంభించామని అన్నారు.
రైతుబంధు పైసలు కాంట్రాక్టర్లకు ఇచ్చి రైతులను ముంచిన్రని,ఇప్పుడు రైతులు )చక్రవడ్డీకి మళ్లీ అప్పులు చేస్తున్నారు.
కాళేశ్వరం గురించి ఇప్పుడున్నోళ్లకు తోక తెల్వది, తొండం తెల్వదు అని,రైతులకు నీళ్లు అందించేందుకు ఆరాటపడి కాళేశ్వరం స్పీడ్ గా కంప్లీట్ చేశామని అన్నారు.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి సంబంధించిన కంపెనీ కట్టిన మిడ్ మానేర్ కట్ట కొట్టుకుపోయింది,కోమటి రెడ్డిని జైల్లో పెట్టాలనుకుంటే మేము పెట్టకపోయేవాళ్లమా,రైతులకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని వదిలిపెట్టామని అన్నారు.గోదావరిలో నీళ్లు ఎత్తటానికి కాంగ్రెస్ ప్రభుత్వని కి చేతనైత లేదు,మేం అధికారంలో ఉన్నప్పుడు మే నెలలో కూడా మత్తడిలు దూంకినాయని అన్నారు.
కాలేశ్వరం లో 50 టీఎంసీ నీళ్లు వదిలేసిన్రు అని ఇంజనీర్లు చెప్పారు,కేసీఆర్ ను బద్నాం చేయాలనే కుట్రతో నీళ్లన్నీ పోయేలా చేశారు అని అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి ఎన్ని పంపులు ఉన్నాయో వీళ్లకు తెలుసా,ప్రాజెక్ట్ లలో చిన్న చిన్న లోపాలు జరుగుతాయి,వాటిని భూతద్దం పెట్టి చూపుతున్నారని , ఇప్పటికీ కాళేశ్వరంలో ఏదో దొరుకతదనే ఉద్దేశంతో ఉన్నారని అన్నారు.50 వేల రైతులను తీసుకొని మేడిగడ్డ పోయి, నీళ్లు నేనే నింపుతా అని అన్నారు.హైదరాబాద్ లో రూపాయికి నల్ల ఇచ్చినామని ,ఇందిరమ్మ రాజ్యం లో ఎప్పుడైనా ఇలా ఇచ్చారా ,అన్ని సిద్ధం చేసిన వ్యవస్థలు ఎందుకు నడుస్తలేవు అని,అంటే మీ చేతగానీ దద్దమ్మతనమే కాదా అని అన్నారు.
హైదరాబాద్ లో మళ్లీ ఎందుకు ట్యాంకర్ల దందా నడుస్తోందో చెప్పాలి,హైదరాబా( Hyderabadద్ లో ట్యాంకర్లు ఫ్రీ గా సప్లయ్ చేయాలని,ప్రజలకు తాగునీళ్లు అంటే మీకు తమషానా, బంగారం లాంటి భగీరథ స్కీమ్ ను ఎందుకు నడుపతలేరు అని అన్నారు.రణరంగం చేసైనా రైతులకు మంచి చేస్తామని,ఇది ప్రకృతి విపత్తు కాదు అని ప్రభుత్వం సృష్టించిన విపత్తు అని అన్నారు.
బ్యాంకులతో మీటింగ్ పెట్టి రుణమాఫీ మీద స్పష్టత ఇవ్వాలని, కేసీఆర్ ఎళ్లిండు,ఇక ఆగడు అని ఎక్కడ రైతులకు కష్టం వస్తే అక్కడ గద్ద లెక్క వాలుతా.సమస్యలు పరిష్కారమయ్యే విధంగా మీ మెడలు వంచి హామీలు అమలయ్యే విధంగా చేస్తామని అన్నారు.
నేత కార్మికులను నీచంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని అన్నారు.ఫసల్ బీమా యోజన అట్టర్ ప్లాప్ స్కీం అని , తెలంగాణ లో బీజేపీ లేదు అని అదో పార్టీ,అదో కథ అని అభ్యర్థుల కోసం మా పార్టీ చుట్టు తిరుగుతున్నారు బీజేపోళ్లు అని అన్నారు.