ఏపీ తెలుగుదేశం పార్టీలో తెలంగాణ ఎన్నికల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.అందుకే వచ్చే ఎన్నికల్లో ఏపీలో అటువంటి తప్పు జరగకుండా ముందు జాగ్రత్తగా అన్ని రకాల ఎత్తుగడలు వేస్తోంది.
ఇప్పటికే ఏపీలో పార్టీ బాగా బలహీనపడడం ప్రజలు సంతృప్తిగా లేకపోవడం తదితర కారణాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది దీనికితోడు ఇప్పటికే పలుమార్లు చేయించిన సర్వేలను నిరాశ కలిగించే నిరాశ కలిగించే ఫలితాలు రావడంతో టిడిపి డైలమాలో పడింది.ఒక వైపు చూస్తే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా దూసుకుపోతుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ చాప కింద నీరులా పార్టీని పార్టీని విస్తరించుకున్నాడు.ఇన్ని ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనలు ఇప్పుడు టిడిపి పడిపోయింది.
అందుకే చాలా నియోజకవర్గాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రజాగ్రహం గురైన సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చాలా వద్దా .? అనే ఆలోచనలు టిడిపి ఉంది.దీనికి తెలంగాణలో కేసీఆర్ వాడిన స్ట్రాటజీని వాడాలా వద్దా అనే డైలమాలో టిడిపి ఉంది.అక్కడ చూస్తే కేసిఆర్ దాదాపు సెట్టింగ్ అందరికీ ఇచ్చాడు.ఫలితాలు కూడా ఆశాజనకంగా వచ్చాయి.అయితే ఆ ప్రయోగం ఇక్కడ వర్కవుట్ అవుతుందా లేదా…? అని టిడిపి భయపడుతోంది.

ఇక టీడీపీ అధినేత కూడా … తెలంగాణ ఎన్నికల ముందు అనేక ఆరోపణలు ఎదుర్కుంటున్న సిట్టింగ్ ఎమ్యెల్యేల పనితీరుపై విరుచుకుపడేవారు… మీకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదు అని మొహమాటం లేకుండా చెప్పేసేవారు.‘నా వద్దకు వచ్చేవారు ప్రభుత్వ పనితీరుపై ఫిర్యాదులు చేయడం లేదు.కొందరు ఎమ్మెల్యేల పనితీరుపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.వారిని మార్చాలంటున్నారు.మీరు మీ తీరు మార్చుకుని ప్రజలకు ఇంకా సన్నిహితం కావాలి.వారికి అందుబాటులో ఉండి పనిచేస్తూ వ్యతిరేకత తగ్గించుకోవాలి.
లేని పక్షంలో నా నిర్ణయం నేను తీసుకోవలసి వస్తుంది’ అని ఏకంగా తెలుగుదేశం శాసనసభాపక్షం సమావేశంలోనే ఎమ్యెల్యేలను బాబు హెచ్చరించారు.

మెజార్టీ సిట్టింగ్ ఎమ్యెల్యేలపై రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని.కలిసి సమస్యలు చెప్పినా స్పందన ఉండడం లేదని… వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని.
పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లను పట్టించుకోవడంలేదని.ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైయ్యిందని… అక్రమార్జన చేస్తున్నారని.
దురుసుగా మాట్లాడుతున్నారని ఇలా ఫిర్యాదులు అధిష్టానానికి వస్తూనే ఉన్నాయి.ఎమ్మెల్యేల పనితీరు, వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని అధినాయకత్వం వారిని మూడు వర్గాలుగా విభజించింది.
మంచి పనితీరు కనబరుస్తున్నవారు మొదటి విభాగం.వారి విషయంలో సమస్య లేదు.
వ్యక్తిగత సంబంధాలు, పార్టీలో నేతలను కలుపుకొని పోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు రెండో విభాగం.వీరు పని తీరు మార్చుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదని నాయకత్వం భావిస్తోంది.
మరీ సమస్యాత్మకంగా ఉన్న వారు మూడో విభాగం.ఇందులో 20-25 మంది ఉన్నా రు.వీరిని మార్చేస్తే బెటర్ అన్నకోణంలో అధిష్టానం ఉంది.ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు మూడు నెలల్లో వచ్చేస్తుండడంతో … టీడీపీ ఈ విషయంలో హైరానా పడుతోంది.







