ఈ మధ్య చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అసలు బాబోరికి ఏమ్మయ్యింది అనే ప్రశ్న ప్రతీ ఒక్కరి మస్తిష్కంలో మెదులుతోంది.తెలంగాణా ఎన్నికల దెబ్బకి బాబు మైండ్ కి ఏమన్నా అయ్యిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు మేధావులు.
ఎందుకంటే తానూ చేసింది మాత్రమే కరెక్ట్.అదే పని మిగిలిన వాళ్ళు చేస్తే తప్పు అంటూ కొంత కాలంగా బాబు మాట్లాడటం ఎన్నో మరెన్నో అనుమానాలు రేకెత్తిస్తోంది.
అసలు ఇంతకీ బాబు కి ఏమయ్యింది.?? ఎలాంటి వ్యాఖ్యలు బాబు చేస్తున్నారు అనే వివరాలలోకి వెళ్తే.

చంద్రబాబు చెన్నైలో కరుణానిధి విగ్రహావిష్కణలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు.అదే ఇప్పుడు సంచలనం రేపుతోంది .రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో “ఈవీఎంల” ట్యాంపరింగ్ చేసి బీజేపీ గెలువాలనుకుంటోంది అని ఆరోపణలు చేశారు.మరి చంద్రబాబు గత ఎన్నికల్లో చెట్టాపట్టాలేసుకొని తిరిగి 2014లో అధికారాన్ని సంపాదించింది కూడా ఇలాగేలా.
అంటే బాబు అధికారంలోకి వచ్చింది ఈవీఎం లు ట్యాంపర్ చేసే వచ్చారా.?? అసలు టెక్నాలజీ తెలుగు రాష్ట్రాలలో రావడానికి నేనే ఆధ్యుడిని అనే బాబు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకూ సబబు.
సరే ఈ విషయం పక్కన పెడితే గతంలో ఏపీలో జరిగిన నంద్యాల ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఈవీఎం లతో ఎన్నికలు వద్దు బ్యాలెట్ పెట్టండి అని విజ్ఞప్తి చేసినప్పుడు ఎందుకు చంద్రబాబు వారిని విమర్శించారు…?? అప్పుడు అవసరం అయిన ఈవీఎం లు ఇప్పుడు ఎందుకు బాబు వద్దు అంటున్నారనేది బాబు చేస్తున్న రాజకీయాలకి అద్దం పడుతుంది.తెలంగాణలో సైతం టీడీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

టీఆర్ఎస్ ఈవీఎం లు ట్యాంపరింగ్ చేసి గెలిచింది అంటూ ఆరోపణలు చేశారు.మరి ఇదే ప్రశ్న పక్క రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చి తెలంగాణా ఘోరమైన పరాభవం చవి చూసిన కాంగ్రెస్ పార్టీని బాబు ఎందుకు అడగటం లేదు.?? ఇప్పుడు ఇవే ప్రశ్నలు బాబు కి సూదుల్లా గుచ్చుకుంటున్నాయి.చంద్రబాబు గారు ఇదేమి రాజకీయం అండీ బాబు అంటూ విమర్సల మీద విమర్శలు చేయిస్తున్నాయి.
ఈ రకమైన విమర్శలు చంద్రబాబు చేయడంతో బాబు కి ఏమయ్యింది అంటూ నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు.







