టీడీపీ మహానాడు కు మహా ఏర్పాటు ! లక్ష మందితో ప్లాన్ ?

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం పెరిగే విధంగా రాబోయే ఎన్నికల నాటికి పార్టీ శ్రేణులు మరింత యాక్టివ్ అయ్యే విధంగా టిడిపి అధినేత చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ శ్రేణులు పోరాటం చేస్తున్న , చాలా మంది పార్టీ నాయకుల్లో ఉత్సాహం కనిపించకపోవడం వంటివి బాబు ని ఆలోచనలో పడేస్తున్నాయి.

 Tdp Mahanadu Arrangements In Ongole, Tdp, Chandrababu, Jagan, Ysrcp, Ap,tdp Maha-TeluguStop.com

ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలు టిడిపి మహానాడు నిర్వహించబోతున్నారు.వీటిని భారీ  స్థాయిలో నిర్వహించాలని , దాదాపు లక్షమందికి పైగా పార్టీ శ్రేణులు హాజరయ్యే విధంగా చంద్రబాబు ప్లాన్ చేశారు.

ఈ మేరకు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ మేరకు మహానాడు నిర్వహణపై చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షమందికి పైగా హాజరవుతారని,  వారికి భోజన వసతి సౌకర్యాలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ పైనే ఉందని బాబు సమావేశంలో ప్రస్తావించారు.
దీని కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

ఈ మేరకు 15 కమిటీలను చంద్రబాబు నియమించారు.ఈ మహానాడు ఒంగోలు పట్టణం సమీపంలోని త్రోవగుంట బృందావన్ ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న 88 ఎకరాల్లో రెండు రోజులపాటు మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

విద్యుత్ , మంచినీటి సౌకర్యానికి ప్రాధాన్యం ఎక్కువ ఇస్తున్నారు , అలాగే పార్కింగ్ సౌకర్యం వంటి వాటి కోసం ముందుగానే పోలీసులు,  విద్యుత్ , మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి తీసుకునే విధంగా ఒక బృందాన్ని బాబు నియమించారు.

Telugu Chandrababu, Jagan, Lokesh, Tdp, Tdp Mahanadu, Ysrcp-Political

రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మహానాడు ద్వారా టిడిపి సత్తా చాటాలి అంటే ఏం చేయాలని విషయంపైన బాబు సమగ్రంగా పార్టీ నేతలతో చర్చించారు .రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు హాజరు కాబోతూ ఉండడం ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముందుగానే ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేయాలని బాబు పార్టీ బాధ్యులకు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube