బాబు యువ మంత్రం.. ఫలించేనా..?

ఏపీ లో ఇన్నాళ్లు ఉన్న ద్విముఖ పోటీ.ఇప్పుడు త్రిముఖ పోటీగా మారుతోంది.

 Chandrababu Naidu Showing More Interest On Young Political Leaders Details, Pava-TeluguStop.com

మొదట్లో కాంగ్రెస్ వర్సెస్ టిడిపి గా ఉన్న రాజకీయాలు.వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత.

వైసీపీ వర్సెస్ టీడీపీ గా మారాయి.తర్వాత మార్పు కోసం అంటూ జనసేన రాజకీయ అరంగేట్రం చేసింది.

దాంతో మెగా అభిమానులు.కాపు కులం వాళ్ళు జనసేన పార్టీ లో చేరడం మొదలు పెట్టారు.

అయితే 2014 సమయం లో పవన్ కళ్యాణ్ తన పార్టీ నీ రంగం లోకి దింపకుండా.వెనుక నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు.

ఇక అప్పుడు చంద్రబాబు పదవి ఇస్తా అని పిలిచినా సున్నితంగా తిరస్కరించాడు.

అయితే 2019 లో మాత్రం ఒంటరిగా కమ్యూనిస్ట్ లను కలుపుకొని పోటీలోకి దిగాడు.

అయితే అనుకున్న ఫలితాలు రాలేదు.ఇక అప్పటి నుంచి పవన్ కొంత కాలం రాజకీయాలకు దూరం అయ్యాడు.

మరి వైపు టీడీపీ కేడర్ కూడా సైలెంట్ అయింది.కొన్నాళ్ళు లోకేష్ గొడవ నడవటం.

పార్టీ కొంచం వీక్ అవడం తో బాబు కూడా మారు మాట్లాడలేదు.అయితే 2019 లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందలమెక్క డానికి యువత ఎంతో పని చేసింది.

దానికి తోడు యువ లీడర్లు ఆయనకు వెన్ను దన్నుగా నిలిచారు.ఇప్పటికీ వైసీపీ లోని 151 మంది ఎమ్మెల్యే లలో చాలా మంది యువకులు ఉన్నారు.

Telugu Siddarth Reddy, Chandrababu, Janasena, Kodaali Nani, Lokesh, Paritala Sri

అదే జోష్ తో అయన చక్రం తిప్పారు.ఇటీవలి వరకు మంత్రి పదవులు చేసి మాజీ లుగా మారిన కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లతో పాటు.పార్టీ లో యూత్ ఫాలోయింగ్ ఉన్న దేవినేని అవినాష్, కర్నూల్ నుంచి.బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డీ.ఇలా చాలా మంది యువ గళం జగన్ తోడుగా.ఒక కంచే ఉంది.

ఇలాంటి యూత్ ఫాలోయింగ్ ఉన్న నేతలు టీడీపీ లోనూ ఉన్నారు.ఇప్పుడు ఆ నేతలను కాంపైనర్లు గా మార్చి ఒకవైపు మామూలు యూత్ ను.పవన్ తో సినిమా, కాపు యువత ను తన వైపు తిప్పుకోవాలి అని చంద్రబాబు చూస్తున్నారు.ఉత్తరాంధ్ర లో ఎంపీ గా గెలిచిన రామ్మోహన్ నాయుడు.

Telugu Siddarth Reddy, Chandrababu, Janasena, Kodaali Nani, Lokesh, Paritala Sri

గోదారి జిల్లాలు, కృష్ణా గుంటూరు లలో ఫాలోయింగ్ ఉన్న వంగవీటి రాధా కృష్ణ.రాయలసీమలో పరిటాల శ్రీరామ్ ఉన్నారు.ఇలా ప్రాంతాల వారీగా పట్టు ఉన్న యువ లిదర్లను అయా ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేయిస్తే.పార్టీ కి మేలు జరుగుతుంది అని భావిస్తున్నారు.వైసీపీ లాగే టీడీపీ కి ఈ మంత్రం బాగానే పని చేస్తుంది అని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.ఇక్కడే వైసీపీ నేతలు తెగ కలవర పడుతున్నారు.

నిజంగా టీడీపీ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే.అది కచ్చితంగా వైసీపీ కి కోలుకోలేని దెబ్బ అవుతుందనీ విశ్లేషకులు అంటున్నారు.

మరి టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ సక్సెస్ అవుతుందా.? లేక వైసీపీ వాళ్ళు టీడీపీ యూత్ నీ లాక్కొని గద్దె ఎక్కుతారా అనేది మరి కొన్ని రోజులు ఆగితే గా నీ తేలదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube