నటసింహాం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.భారీ అంచనాల నడుమ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
యూఎస్ఏలో 1200 థియేటర్స్ లో వీరసింహారెడ్డి మూవీ రిలీజ్ కానుంది.ఇటు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1500 థియేటర్లలో విడుదల కానుంది.
కాగా ఈ చిత్రంలో బాలయ్య డబుల్ యాక్షన్ రోల్ లో కనిపించనున్నారు.ఇప్పటికే వీరసింహారెడ్డి మాస్ సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.కాగా ప్రపంచ వ్యాప్తంగా 73.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగనుండగా ఏపీ, తెలంగాణలో రూ.61.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగనుంది.







