స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో బయటకు వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబుకు( Chandrababu Naidu ) షరతులతో కూడిన బెయిల్ లభించింది.అయితే కొద్ది రోజుల క్రితం ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ఎటువంటి షరతులు లేకుండా బెయిల్ మంజూరు చేయడం, ఆయన రాజకీయ సభలు సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి లభించడంతో, ఇక జనం బాట పట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
చంద్రబాబు అరెస్టుకు ముందు నియోజకవర్గాలు జిల్లాల వారిగా పర్యటనలు చేపట్టారు.సెప్టెంబర్ 9వ తేదీన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో పర్యటిస్తుండగా చంద్రబాబును కేసులో సిఐడి పోలీసులు( CID ) అరెస్ట్ చేశారు.
ఈనెల 28 వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఆ తర్వాత ఈనెల 20వ తేదీన చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ కోర్టు మంజూరు చేసింది .ఇప్పటికే చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తోను చర్చించారు. జనసేన, టిడిపిలో అంతర్గతంగా సమావేశాలు నిర్వహించుకున్నాయి.
ఈ మేరకు నవంబర్ 29 నుంచి చంద్రబాబు ర్యాలీలు, రాజకీయ సమావేశల్లో పాల్గొనేందుకు హైకోర్టు కూడా అనుమతి ఇవ్వడంతో, ఇక జనం బాట పట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.ఈ మేరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనెల 29 న చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని, త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని చెబుతున్నారు.

ఏపీలో ఎన్నికల( AP Elections ) సమయం దగ్గరపడిన నేపథ్యంలో , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు భారీ సభలు ప్లాన్ చేస్తున్నారట.ప్రజలకు దగ్గరయ్యే విధంగా ముందుకు వెళ్లబోతున్నట్లు టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉండడం తో దానికి అనుగుణంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం సిద్ధమవుతున్నారట.

ఈనెల 24 నుంచి నారా లోకేష్( Nara Lokesh ) యువ గళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు .అయితే అది 27కు వాయిదా పడింది .పాదయాత్ర మధ్యలో నిలిచిపోయిన కోనసీమ జిల్లా రాజోలు నుంచి ఆయన యాత్రను ప్రారంభిస్తున్నారు .టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడిగా కార్యక్రమాల్లో పాల్గొంటూ టిడిపి, జనసేన ను ప్రజలకు మరింత దగ్గర చేసే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారట.







