ఒంటరిపోరే బెటరా ? బాబు నిర్ణయం తీసేసుకున్నారా ?

ఏపీ రాజకీయాలు గజబిజీ గందరగోళంగా మారిపోయాయి.వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అనే విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది.

 Chandrababu Naidu Clarity About Tdp Janasena Aliance , Janasena, Pavan Kalyan,-TeluguStop.com

అధికార పార్టీ వైసిపి ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని చెబుతూనే వస్తుండగా, జనసేన ,బిజెపిలను కలుపుకుని వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే జనసేనతో పొత్తుల అంశంపై అనేక సార్లు చర్చించారు.

పొత్తులపై బిజేపి వ్యతిరేకత చూపుతూనే వచ్చినా,  మారిన పరిస్థితుల నేపథ్యంలో టిడిపిని కలుపుకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంది.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కుర్చీ విషయంలో తనకు ఆశ లేదని చెబుతూనే , చంద్రబాబును ( Chandrababu Naidu )ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.

దీంతో టిడిపిలో మరింత ఉత్సాహం పెరిగింది.అయితే ప్రస్తుతం వారాహి యాత్ర ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్,  తాను ముఖ్యమంత్రి అవుతానని, జనసేన ను గెలిపించాలంటూ కోరుతుండడం వంటివి టిడిపికి ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

Telugu Chandrababu, Janasena, Pavan Kalyan, Tdpjanasena, Telugudesam, Ysrcp-Poli

ఈ నేపథ్యంలో టిడిపి ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఏ విధంగా ఉంటుందనే విషయంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.ఈ మేరకు ఇప్పటికే అనేక సర్వేలు చేయించిన బాబు ఆ సర్వే రిపోర్ట్ లో ప్రకారం ఒంటరిగా టిడిపి( TDP ) ఎన్నికలకు వెళ్లినా, గెలిచే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు అందాయట.దీంతో పొత్తుల చట్రంలో చిక్కుకుని ఇబ్బందులు పడే కంటే ఒంటరిగా ఎన్నికలకు వెళ్తేనే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారట .అంతే కాకుండా ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా,  టిడిపి ఒంటరిగా పోటీ చేసి గెలవలేదు అనే అభిప్రాయాల నుంచి జనాలను బయటపడేవచ్చనే ఆలోచనతో ఉన్నారట.అదీ కాకుండా ఏపీలో జనసేన బీజేపీల( Jana sena ) బలం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.టిడిపికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టమైన కేడర్ ఉండడం, టిడిపి ని అధికారంలోకి తీసుకురావాలనే కసి పార్టీ నాయకుల్లో పెరగడం ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే విధంగా పార్టీని సిద్ధం చేస్తున్నారు.

Telugu Chandrababu, Janasena, Pavan Kalyan, Tdpjanasena, Telugudesam, Ysrcp-Poli

 ఇక జనసేన , బీజేపీ లు టీడీపీ తో పొత్తు పెట్టుకునేందుకు భారీగా సీట్లు కోరుతుండడం, అది కూడా టీడీపీ బలంగా ఉన్న స్థానాలను ఆశిస్తుండడం తో అక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్న వారు, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు జనసేన తో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట.ఇక ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు గా స్టేట్మెంట్స్ ఇస్తుండడం తో చంద్రబాబు సైతం ఒంటరి పోరుకే మొగ్గు చూపిస్తున్నారట.దీనిపై పార్టీ కీలక నేతలతో చర్చించి త్వరలోనే క్లారిటీ కి రాబోతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube