ఏపీ సీఎం జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.వైసీపీ పాలనలో వేధింపులు తాళలేకనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.
జగన్ ప్రభుత్వం గంజాయి పేరుతో అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ను పాటించడం లేదని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం పోరాడుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.జగన్ ప్రభుత్వంంలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ లు వచ్చాయన్న చంద్రబాబు ఏపీలో ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి పోరాడాలని తెలిపారు.
నాలుగేళ్లలో విశాఖకు రూపాయి పెట్టుబడి కూడా రాలేదని ఎద్దేవా చేశారు.అంతేకాకుండా విశాఖలో రూ.40 వేల కోట్లను దోచుకున్నారని ఆరోపించారు.







