Chandrababu naidu : బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు చూపులు.. సీట్లు రిజర్వ్..!!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ పొత్తుల కోసం వెంపర్లాడుతోందని తెలుస్తోంది.

ఇప్పటికే జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఇంకా బీజేపీతో కూడా పొత్తు కోసం టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు పాకులాడుతున్నారని పలుు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.బీజేపీ పెద్దల పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు వారితో కీలక సమావేశాలను సైతం నిర్వహించారు.

అయితే టీడీపీతో బీజేపీ పొత్తు వ్యవహారంపై మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు.ఈ క్రమంలోనే అభ్యర్థుల జాబితా ప్రకటనపై టీడీపీ, జనసేన ( TDP, Jana Sena )జాప్యం చేస్తూ వచ్చాయి.

బీజేపీ ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో టీడీపీ -జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడిగా మొత్తం 118 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.వీరిలో టీడీపీ అభ్యర్థులు 94 మంది ఉండగా.

Advertisement

జనసేన అభ్యర్థులు 24 మంది ఉన్నారు.

రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి.ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి కొన్ని సీట్లు కేటాయించిన చంద్రబాబు పొత్తుల నేపథ్యంలో జనసేనకు కొన్ని సీట్లను ముష్టి వేశారని తెలుస్తోంది.బీజేపీతో పొత్తు కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారని, అందుకే వారి కోసం 57 అసెంబ్లీ స్థానాలను రిజర్వ్ చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే దమ్ము చంద్రబాబు( Chandrababu naidu )కు లేదని వైసీపీ నేతలతో పాటు ఏపీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే పొత్తులతో గుంపుగా వెళ్తున్నారంటూ ఇప్పటికే పలు విమర్శలు, ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా చంద్రబాబు కొన్ని సీట్లను అలానే పెట్టడంతో బీజేపీతో పొత్తు కోసం ఇంకా వేచి చూస్తున్నారని తెలుస్తోంది.

అందుకే బీజేపీ ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేలా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.కానీ టీడీపీతో( TDP ) కమలదళం కలిసి వస్తుందా ? లేదా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఏదీ ఏమైనా తాను గెలవడం కోసం, స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు పొత్తులను వినియోగించుకుంటున్నారని.

ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ దిద్దుకోలేని తప్పు చేశారా.. కొత్త ఆఫర్లు రావడం కష్టమేనా? 
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వ్యాఖ్యలు

ప్రస్తుత లిస్టుతో ఆయన బుద్ధి బయటపడిందని ఏపీ ప్రజలు భావిస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు