టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు వంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదని మండిపడ్డారు.
ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ తో పాటు జనసేనాని పవన్ కల్యాణ్ పై గతంలో చంద్రబాబు విమర్శలు చేశారని నారాయణ స్వామి గుర్తు చేశారు.కానీ ఇప్పుడు వాళ్లనే పక్కన పెట్టుకున్నారని విమర్శించారు.
పొత్తులతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు.అభ్యర్థుల మార్పు పార్టీ అంతర్గత విషయమని నారాయణ స్వామి స్పష్టం చేశారు.
అలాగే రాష్ట్రంలో కరోనా గురించి ఎవరూ భయపడాల్సిన పని లేదని చెప్పారు.ఏపీ ప్రభుత్వ అన్ని విధాల అప్రమత్తంగా ఉందని తెలిపారు.