ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో రేవంత్ ఎపిసోడ్.హాట్ టాపిక్.
అయ్యింది.రేవంత్ టి- టీడీపీని వదిలి కాంగ్రెస్ లోకి వెళ్లిపోతున్నారు అనడానికి గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలే సాక్ష్యం.
ఇది ఇలా ఉంటే.ఢిల్లీ నుంచీ తిరిగి వచ్చిన రేవంత్ నిన్న మాట్లాడిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ఒక్కసారిగా ఏపీ – టీడీపీమీద రేవంత్ చేసిన కామెంట్స్ విని షాక్ అయ్యారు అక్కడ ఉన్న వాళ్ళు.ఆ మాటలకి అప్పటివరకు రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్ళరు అని భావించిన వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసేసుకున్నారు
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు టీటీడీపీ నేతలను జైళ్లలో పెడుతున్నారు.మరి ఏపీ టీడీపీ నేతలు మాత్రం కేసీఆర్‌కు వంగి వంగి దండాలు పెడుతున్నారు .అంటూ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.వారికి కేసీఆర్‌తో లావాదేవీలు ఉన్నాయని ఆరోపించారు.
ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడి పెళ్లికి వెళ్లినప్పుడు కేసీఆర్‌కు ఏపీ టీడీపీ నేతలు వంగి వంగి దండాలు పెట్టారు.అంతగా సలాములు ఎందుకు కొడుతున్నారు? మరి తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి పెళ్లికి చంద్రబాబు వచ్చినప్పుడు టీఆర్ఎస్ నాయకులు అలానే చేశారా? ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడితో కేసీఆర్‌కు లావాదేవీలు ఉన్నాయి.కేసీఆర్ ఆయనకు రూ.2 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టారు.అంటూ రేవంత్ తనదైన శైలిలో మాట్లాడటం ఏపీ మంత్రుల్లో గుబులు రేపింది.ఏకు మేకవ్వడం అంటే ఇదేనేమో.అని అనుకుంటున్నారు.ఏపీ మంత్రులు
రేవంత్ తోనే ఏపీ సైకిల్ కి బ్రేకులు…
రాజకీయలలో శాశ్వత మిత్రులు ఉండరు.
శాశ్వత శత్రువులు ఉండరు.అంటారు ఇందుకేనేమో.
కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో రేవంత్ బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ తనతో చర్చలు జరుపుతున్నది వాస్తవమేనని ఆయన వెల్లడించారు.
ఇది ఇలా ఉంటే రేవంత్ కాంగ్రెస్ లో పూర్తి స్థాయిలో భాద్యతలు చేపట్టిన తరువాత.రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పక్షాల మీద రేవంత్ తో మాటల దాడి చేయించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయని సమాచారం
కాంగ్రెస్ చెప్పినా చెప్పకపోయినా రేవంత్ కేసీఆర్ ని ఒక ఆట ఆడుకోవడం ఖాయం…అయితే ఏపీ కాంగ్రెస్ రేవంత్ తో ఏపీ టీడీపీకి కి చెక్ పెట్టాలని భావిస్తోంది.
ఎంతో.వాక్చాతుర్యం.ప్రత్యర్థులని.మాటల…దాడితో నిలువరించే సత్తా ఉన్న రేవంత్ తో పోటీ పడగలు వ్యక్తులు ఏపీ- టీడీపీలో లేరు.చంద్రబాబు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని.రేవంత్ నోటి ద్వారా చెప్పిస్తూ…మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద మాటల దాడి చేసేలా రంగం సిద్ధం చేస్తున్నారు.మొన్నటి వరకు రేవంత్ అంటే చంద్రబాబుకి వీర విధేయుడిగా ఉండే వ్యక్తి.బాబు మీద ఈగ వాలినా సరే ఉరుకోడు.
అలాంటి వ్యక్తితో బాబుకి వ్యతిరేకంగా కనుక ప్రచారం చేయిస్తే.తప్పకుండా ప్రభావం ఉంటుంది అని వారి అంచనా
ఒక వేళ ఈ ప్లాన్ అమలు చేయడంలో ఏపీ- కాంగ్రెస్ సక్సెస్ అయితే చంద్రబాబుకి నష్టం తప్పదని భావిస్తున్నారు విశ్లేషకులు.
రేవంత్ లాంటి ఫైర్ బ్రాండ్ లాంటివారిపై కౌంటర్ ఎటాక్ చేసేవాళ్ళు టిడిపిలో లేకపోవడం బాబుకి మైనస్.ఏకు మేకవ్వడం అంటే ఇదే మరి.