టీడీపీ అధినేత చంద్రబాబు దొరికిపోయిన దొంగ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.దీక్షలు అనేవి నిజాయితీపరులు చేయాలన్న ఆయన అవినీతిపరులు కాదని తెలిపారు.
గాంధీ జయంతిని కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని మంత్రి మేరుగ ఆరోపించారు.చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపే దమ్ము లేదని పేర్కొన్నారు.2024లో టీడీపీకి మరోసారి శిక్ష వేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు.పవన్ పరిస్థితి ఏంటో ఆయనకే తెలియదని స్పష్టం చేశారు.
చంద్రబాబు మోచేతి నీళ్లు తాగితే ప్రజలు ఓట్లు వేయరని తెలిపారు.







