జగన్ బాటలో బాబు .. వాళ్లను వదిలించుకుంటున్నారా ? 

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu naidu )కఠిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లే విధంగా కనిపిస్తున్నారు.ఇప్పటికీ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పార్టీ టికెట్ల కేటాయింపు విషయంలో అన్ని మొహమాటలను పక్కన పెట్టారు.

 Chandrababu In The Path Of Jagan Getting Rid Of Them, Jagan, Tdp, Cbn, Chandrab-TeluguStop.com

గెలుస్తారనుకున్న వారికే టికెట్లు కేటాయించారు.సర్వే నివేదికలను పరిగణలోకి తీసుకుని టికెట్లు కేటాయింపులు చేపట్టారు.

తనకు అత్యంత సన్నిహితులైన వారిని పక్కన పెట్టేందుకు జగన్ ఏ మాత్రం మొహమాట పడలేదు.వైసీపీలో టికెట్లు ఆశించి భంగపడిన నేతలంతా తమ ప్రత్యర్థి పార్టీలో చేరుతున్నా.

జగన్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.రాజకీయంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద సంచలనమే.

అయితే జగన్ తీసుకుంది తొందరపాటు చర్యగా ముందుగా అంతా భావించినా.టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఇప్పుడు జగన్ బాటలోనే ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.

Telugu Ap, Chandrababu, Jagan, Pawan Kalyan, Tdp Tickets-Politics

వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలవడం అత్యంత అవసరం.ఇప్పుడు పార్టీ గెలవకపోతే వాటి ఉనికి కూడా ప్రమాదంలో పడుతుంది.అందుకే టికెట్ల కేటాయింపు లో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని బాబు నిర్ణయించుకున్నారు.వారసులు, సీనియర్లు ఇలా వేటినీ పట్టించుకోకూడదు అని , గెలుస్తారు అనుకున్న వారికే టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు .అందుకే గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని , పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా నిలబడిన వారిని భారీగా సొమ్ములు ఖర్చుపెట్టి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని సైతం పక్కన పెట్టేందుకు నిర్ణయించుకున్నారు .టికెట్లు పెద్ద ఎత్తున యువకులు ఎన్ఆర్ఐ లకు ఇచ్చేందుకు చంద్రబాబు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు .దీంతో పార్టీ సీనియర్ నేతల్లోనూ , టికెట్స్ ఆశిస్తున్న వారిలో టెన్షన్ మొదలైంది.ఎక్కువ టికెట్లు వారికే ఇవ్వనున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోండడంతో సీనియర్ నేతలు మరింతగా టెన్షన్ పడుతున్నారు.

Telugu Ap, Chandrababu, Jagan, Pawan Kalyan, Tdp Tickets-Politics

 జనసేన( Janasena )కు కేటాయించి సీట్లు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఎంపికలో చంద్రబాబు జాగ్రత్త గానే నిర్ణయాలు తీసుకుంటున్నారు .ఎవరికి మొహమాటలతో హామీలు ఇవ్వడం లేదు.పార్టీలో టికెట్ దొరక్క అసంతృప్తికి గురై ఇతర పార్టీలో చేరేందుకు సిద్ధమైనా వెనకడుగు వేయకూడదు అని బాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం .ఇప్పటికే కొన్ని సీట్ల విషయంలో చంద్రబాబు క్లారిటీ కి వచ్చినట్లు తెలుస్తోంది.చింతమనేని ప్రభాకర్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి( Chintamaneni Prabhakar ) ఇటువంటివారినీ పక్కన పెట్టేందుకు చంద్రబాబు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube