జగన్ బాటలో బాబు .. వాళ్లను వదిలించుకుంటున్నారా ? 

జగన్ బాటలో బాబు వాళ్లను వదిలించుకుంటున్నారా ? 

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu )కఠిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లే విధంగా కనిపిస్తున్నారు.

జగన్ బాటలో బాబు వాళ్లను వదిలించుకుంటున్నారా ? 

ఇప్పటికీ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పార్టీ టికెట్ల కేటాయింపు విషయంలో అన్ని మొహమాటలను పక్కన పెట్టారు.

జగన్ బాటలో బాబు వాళ్లను వదిలించుకుంటున్నారా ? 

గెలుస్తారనుకున్న వారికే టికెట్లు కేటాయించారు.సర్వే నివేదికలను పరిగణలోకి తీసుకుని టికెట్లు కేటాయింపులు చేపట్టారు.

తనకు అత్యంత సన్నిహితులైన వారిని పక్కన పెట్టేందుకు జగన్ ఏ మాత్రం మొహమాట పడలేదు.

వైసీపీలో టికెట్లు ఆశించి భంగపడిన నేతలంతా తమ ప్రత్యర్థి పార్టీలో చేరుతున్నా.జగన్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.

రాజకీయంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద సంచలనమే.అయితే జగన్ తీసుకుంది తొందరపాటు చర్యగా ముందుగా అంతా భావించినా.

టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఇప్పుడు జగన్ బాటలోనే ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.

"""/" / వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలవడం అత్యంత అవసరం.ఇప్పుడు పార్టీ గెలవకపోతే వాటి ఉనికి కూడా ప్రమాదంలో పడుతుంది.

అందుకే టికెట్ల కేటాయింపు లో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని బాబు నిర్ణయించుకున్నారు.

వారసులు, సీనియర్లు ఇలా వేటినీ పట్టించుకోకూడదు అని , గెలుస్తారు అనుకున్న వారికే టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు .

అందుకే గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని , పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా నిలబడిన వారిని భారీగా సొమ్ములు ఖర్చుపెట్టి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని సైతం పక్కన పెట్టేందుకు నిర్ణయించుకున్నారు .

టికెట్లు పెద్ద ఎత్తున యువకులు ఎన్ఆర్ఐ లకు ఇచ్చేందుకు చంద్రబాబు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు .

దీంతో పార్టీ సీనియర్ నేతల్లోనూ , టికెట్స్ ఆశిస్తున్న వారిలో టెన్షన్ మొదలైంది.

ఎక్కువ టికెట్లు వారికే ఇవ్వనున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోండడంతో సీనియర్ నేతలు మరింతగా టెన్షన్ పడుతున్నారు.

"""/" /  జనసేన( Janasena )కు కేటాయించి సీట్లు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఎంపికలో చంద్రబాబు జాగ్రత్త గానే నిర్ణయాలు తీసుకుంటున్నారు .

ఎవరికి మొహమాటలతో హామీలు ఇవ్వడం లేదు.పార్టీలో టికెట్ దొరక్క అసంతృప్తికి గురై ఇతర పార్టీలో చేరేందుకు సిద్ధమైనా వెనకడుగు వేయకూడదు అని బాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం .

ఇప్పటికే కొన్ని సీట్ల విషయంలో చంద్రబాబు క్లారిటీ కి వచ్చినట్లు తెలుస్తోంది.చింతమనేని ప్రభాకర్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి( Chintamaneni Prabhakar ) ఇటువంటివారినీ పక్కన పెట్టేందుకు చంద్రబాబు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.