సీమాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఒక విమర్శ ఉంది అదే.ఆయన టెక్నాలజీ అభివృద్దికోసమే పనిచేసాడు కానీ, రైతులను, పేద వారిని పట్టించుకోలేదు అని.
ఇక అదే విమర్సని ఒక ఆయుధంగా మలచుకున్న చంద్రబాబు తాను హైటెక్ బాబుగా ప్రచారం చేసుకున్నారు.అయితే ఇదంతా గతం కదా.ఇపుడు ఎందుకు ఈ విశేషాలు అంటారా.అసలు విషయం ఏమిటంటే చంద్రబాబు 10ఏళ్ల తరువాత మళ్లీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయనకు ఆ హై టెక్ అలవాట్లు పోలేదు.
ఎందుకంటే ఇప్పుడు ఆయన సీమంధ్రలో ప్రవేశబెట్టబోతున్న సరికొత్త పధకం గురించి వింటే అందరూ ఆయన్ని ఔరా అనక తప్పదు.అదేమిటంటే సీమాంధ్రలో ప్రతి ఇంటిని ఇంటెర్నెట్ హౌస్ గా మార్చనున్నాడు బాబు.
ఈ మేరకు శుక్రవారం జరిగిన మీటింగ్ లో ఒక నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం.రాష్ట్రంలోని కోటీ 30 లక్షల కుటుంబాలకు రూ.159లకే ఇంటర్ నెట్ సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.ఈ ప్రాజెక్టు కోసం 10 కోట్ల రూపాయలు మూలధనంగా కేటాయించింది.
ప్రతి ఇంటికి 10- 15 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్ నెట్ అందించాలన్నది చంద్రబాబు వ్యూహం.ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుగా పిలుచుకునే ఈ పథకం ద్వారా ఏపీని అత్యున్నత సాంకేతిక రాష్ట్రంగా తయారు చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తుంది.
ఐతే పథకం బ్రహ్మాండంగా ఉన్నా.అది అమలులో ఎంతవరకూ సఫలమవుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.మరి బాబుగారు ఊరికే నెట్ సౌకర్యం కల్పించి ఊరుకుంటారో లేక నెట్ ఆధారిత ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటారో చూడాలి.
.






