ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన వ్యాఖ్యలతో రోజుకో చిక్కుని తెచ్చిపెట్టుకుంటున్నారు.అంతేకాకుండా మునుపటిలాగా ఆలోచించి మాట్లాడటం లేదు.
తనలో ఉన్న కోపాన్ని బయట పెట్టాలి అని అనుకుంటున్నారో, లేక నిజంగానే తప్పుడు మనుషులను హెచ్చరించాలి అన్న ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసారో తెలీదు కానీ కడప, కర్నూల్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.ఆయన మాట్లాడుతూ కడప, కర్నూలు జిల్లాల రౌడీయిజాన్ని కొత్త రాజధాని తుళ్లూరులో ప్రవేశపెట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, దాన్ని సహించేది లేదని, ఖబడ్దార్ అంటూ ఇన్‌డైరెక్ట్ గా జగన్ మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఈ వ్యాఖ్యలను కొంగ్రెస్ నేత తులసి రెడ్డి ఖండించారు.ఆయన చంద్రబాబు తీరుపై మాట్లాడుతూ చంద్రబాబు కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బావుంటుంది అంటూ ఆయన బాబును హెచ్చరించారు.
అంతేకాకుండా కడప జిల్లాలో ఫ్యాక్షన్ సంస్కృతి పూర్తిగా అంతరించిపోయిందని, అదే జిల్లాలో పోతులూరి వీరబ్రాహ్మం, కడప కోటిరెడ్డి ఇలా ఎందరో మహానుబావులు సైతం జన్మించారు అని, ఎవరో కొందరు చేసిన తప్పుకు జిల్లా మొత్తాన్ని అవమానించేలా మాట్లాడటం సరికాదు అంటూ ఆయన చంద్రబాబును హెచ్చరించారు.ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే బాబు పై ఫేర్ అయిన ఆ రెడ్డిగారిది సైతం అదే జిల్లా కావడం.







