పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్.ఈమె పవన్‌తో విడాకులు తీసుకున్నప్పటికి గత కొంత కాలంగా ప్రతీ విషయంలో కూడా పవన్‌ను ప్రస్థావిస్తూ మీడియాలో స్థానం సంపాదిస్తోంది.
పవన్ ఏం పని చేసినా, పవన్ సినిమాల గురించి ఎప్పటికప్పుడు స్పందిస్తూ అందరిలోనూ చర్చనీయాంశం అవుతోంది.తాజాగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో జాయిన్ అయిన విషయం తెల్సిందే.
ఈ విషయంపై కూడా రేణు దేశాయ్ తనదైన స్టైల్‌లో స్పందించింది.
పవన్‌ను తాను చాలా కాలంగా ఫేస్‌బుక్ లేదా ట్విట్టర్‌లో జాయిన్ కావాల్సిందిగా కోరుతూ వస్తున్నాను.
అయితే ఆయన మాత్రం తన మాటను పెడచెవిన పెడుతూ వచ్చాడు.ఇన్ని రోజులకు తను అనుకున్నట్లుగా పవన్ సోషల్ మీడియాలోకి రావడం సంతోషంగా ఉందని చెప్పుకొస్తుంది.
రేణు బలవంతం మీదనే పవన్ ట్విట్టర్‌లో ఖాతా ఓపెన్ చేశాడని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు.అయితే గతంలో పవన్‌ను రేణు దేశాయ్ ట్విట్టర్‌లోకి రావాలని కోరినా ఇప్పుడు మాత్రం పవన్ తన సొంత నిర్ణయంతోనే ట్విట్టర్‌లో ఖాతా ఓపెన్ చేశాడని ఆయన సన్నిహితులు అంటున్నాడు.
ఒక్క రోజులోనే పవన్ ట్విట్టర్ ఖాతాను ఫాలో అయ్యేవారి సంఖ్య లక్షను మించింది.








