ఏపీలో త్వరలో రానున్న ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన కలిసి పోటీకి వెళ్లున్నాయన్న సంగతి తెలిసిందే.ఈ మేరకు ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు,( Chandrababu ) పవన్ కల్యాణ్( Pawan Kalyan ) 118 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఉమ్మడిగా అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి.
అయితే ఈ ఫస్ట్ లిస్టుతోనే చంద్రబాబు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారని తెలుస్తోంది.బయటకు ఎన్ని చెప్పినా.
ఎన్ని నీతులు మాట్లాడినా చివరకు తనకు, తన పార్టీకి లబ్ధి చేకూరే విధంగానే ఆయన వ్యవహరిస్తారని ఈ జాబితా ప్రకటనతో అర్థం అయిందని పలువురు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.
జనసేనతో( Janasena ) చంద్రబాబు పొత్తు పెట్టుకున్నది కేవలం పవన్ కల్యాణ్ కు ఉన్న కాపుల బలాన్ని వాడుకునేందుకేనని క్లియర్ కట్ గా అర్థం అవుతుందని అంటున్నారు.
తొలి విడత జాబితాలో భాగంగా మొత్తం 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇందులో టీడీపీకి 94 స్థానాలు కాగా జనసేనకు 24 సీట్లను కేటాయించారు.
అయితే ఇక్కడే అసలు మతలబు ఉందని తెలుస్తోంది.

టీడీపీ( TDP ) 94 స్థానాలకు అభ్యర్థి పేర్లను ప్రకటించారు.కానీ జనసేనకు 24 స్థానాలను కేటాయించామని చెప్పినప్పటికీ కేవలం ఐదుగురి పేర్లను మాత్రమే ప్రకటించారు.మిగతా 19 స్థానాల్లో ఎవరు బరిలో ఉంటారనే విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు.
అంటే ఆ స్థానాల్లోనూ చంద్రబాబు సూచించిన అభ్యర్థులకే టికెట్ కేటాయించి జనసేన తరపున పోటీ చేయిస్తారా అనే సందేహం ప్రతి ఒక్కరి మదిలో మెదలాడుతోంది.

రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.118 స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.అలాగే మిగిలిన 57 స్థానాలకు జనసేన -టీడీపీ కూటమి( Janasena TDP Alliance ) అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
అయితే వాటిలో ఎన్ని జనసేనకు కేటాయిస్తారోనన్నది తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.ఏదీ ఏమైనా పొత్తు పేరుతో జనసేనాని పవన్ కు, కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు మరో సారి పోటు పొచినట్లేనని క్యాడర్ లో అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయని సమాచారం.

అయితే టీడీపీ ప్రకటించిన సీట్లలో కొందరు సీనియర్ నేతలు మినహా మిగతా ముఖ్యనేతలకు అసెంబ్లీ టికెట్లను చంద్రబాబు కేటాయించారు.కుప్పం నుంచి చంద్రబాబు బరిలో దిగనుండగా.మంగళగిరి నుంచి నారా లోకేశ్( Nara Lokesh ) పోటీ చేయనున్నారు.అలాగే అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, కొల్లు రవీంద్ర, బొండా ఉమా వంటి నేతల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
కానీ జనసేనకు కేటాయించిన 24 స్థానాల్లో కేవలం ఐదుగురు పేర్లను మాత్రమే పవన్ ప్రకటించారు.అయితే ఈ ఐదుగురిలో తన పేరు లేదు.పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలో దిగుతారనే విషయాన్ని ప్రకటించలేదు.
అయితే.
చివరకు జనసేనాని పవన్ కల్యాణ్ తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారని, కనీసం తన సీటును కూడా ప్రకటించుకోలేని స్థితిలో ఉన్నారని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పవన్ పొత్తుకు సిద్ధమై చంద్రబాబుకు తలొగ్గారని జనసేన పార్టీ మద్ధతుదారులతో పాటు జన సైనికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.