ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జగన్ మూడు ముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేశారని విమర్శించారు.
విశాఖలో ప్రభుత్వ భూములను జగన్, విజయసాయి రెడ్డి కొట్టేస్తున్నారని ఆరోపించారు.గతంలో రాయలసీమలో ముఠాలు ఉండేవని, కానీ తాను ముఖ్యమంత్రి అయ్యాక ముఠాలు లేకుండా చేశానని తెలిపారు.
రాయలసీమలో కక్షలను తగ్గించి అభివృద్ధి చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు.కానీ జగన్ అధికారంలోకి వచ్చాక మళ్లీ ముఠాలు పెరగడంతో పాటు అరాచకాలు పెరుగుతున్నాయని ఆరోపించారు.