ఏపీలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా దేశ రాజకీయాలపై ద్రుష్టి పెట్టి ఏకంగా ప్రధాని మోడీని గద్దె దించాలనే గట్టి పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నాడు.ఇందులో భాగంగా తనని ఏ మాత్రం పట్టించుకోని నార్త్ ఇండియా వెళ్లి మోడీని ఓడించాలని ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు.
ఇక మోడీ పాలనలో అరాచకం ఎక్కువైపోయింది అంటూ పదే పదే ఊదరగొడుతున్నారు.నరేంద్రమోదీ హయాంలో దేశంలో స్వతంత్ర సంస్థలు నిర్వీర్యమయ్యాయని పదే పదే ఆరోపణలు వెనుక బాబు చాలా పెద్ద ఎత్తుగడ ఉందని చెప్పుకుంటున్నారు.
ఏపీ రాజకీయాలని పక్కన పెట్టి దేశ రాజకీయాలలో బాబు వేళ్ళు పెట్టడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని కూడా ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
ప్రస్తుతం ఏపీలో ఓటింగ్ సరళి చూస్తూ ఉంటే ఈ సారి చంద్రబాబు గెలిచే అవకాశాలు అస్సలు లేవని తెలిసిపోతుంది.
ఓ వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు, మరో వాపు పవన్ ఫ్యాక్టర్ కారణంగా బాబుకి భారీ ఎదురుదెబ్బ తగలబోతుంది అని రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తుంది.బాబు బయటకి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీకి అంత సీన్ లేదని ప్రజలు తేల్చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
ఈ నేపధ్యంలో ఏపీలో మళ్ళీ తనకి ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ తరుపున కూర్చునే అవకాశం వచ్చే అవకాశం ఉండదని టాక్ వినిపిస్తుంది.

2024 ఎన్నికలలో ప్రధానంగా పోటీ వైసీపీ, జనసేన మధ్యనే ఉంటుందని, టీడీపీ నామమాత్రంగా మిగిలిపోతుందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు.ఇలాంటి పరిస్థితిలో దేశ రాజకీయాలో కీలకంగా మారితే అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో చక్రం తిప్పే అవకాశం ఉంటుందని, తన రాజకీయ చతురతతో దేశ రాజకీయాలలో తనకి అగ్రతాంబూలం ఇస్తారని బాబు భావించి ఇప్పటి నుంచే దానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని టాక్ వినిపిస్తుంది.