ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం ఖరారు చేశారు.శాసనసభ, మండలి సమావేశాలు ముగిశాక ఏప్రిల్ 6వ తేదీన కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారని తెలుస్తోంది.
ఈ ప్రక్షాళనలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన ఖాయంగా కనిపిస్తోంది.అలాగే కొత్తగా పలువురికి ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.
బాబు కేబినెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేవాళ్లలో ముందుగా ఆయన తనయుడు లోకేశ్ ఉంటారు.
లోకేశ్ తర్వాత ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర యాదవ్, జంపింగ్ ఎమ్మెల్యేల్లో కర్నూలు జిల్లాకు చెందిన భూమా అఖిలప్రియ, చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
మైనార్టీ కోటాలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన షరీఫ్‌కు ఛాన్స్ వస్తుందని టాక్.
ఎమ్మెల్సీల నుంచి డొక్కా మాణిక్య వరప్రసాద్, పయ్యావుల కేశవ్, మాగుంట శ్రీనివాసులరెడ్డి రేసులో ఉన్నారు.
ఇక గుంటూరు జిల్లాకు చెందిన జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, కృష్ణాకు చెందిన కాగిత వెంకట్రావుల పేర్లు ఉన్నా వారికి ఛాన్సులు కష్టమే అని తెలుస్తోంది.ఇక అవుట్ లిస్టులో పీతల సుజాత, కిమిడి మృణాళిని, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్‌బాబుతోపాటు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నారు.బాబు కేబినెట్‌లో సేఫ్ – ఔట్ – డౌట్ లిస్టుల్లో మంత్రుల వివరాలు :
సేఫ్ జాబితా : చిన రాజప్ప, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, సీహెచ్ అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత, కె.అచ్చన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు.
డౌట్ జాబితా : బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, పల్లె రఘునాధరెడ్డి, సిద్ధా రాఘవరావు.ఈ లిస్టులో ఒకరిద్దరు అయినా ఔట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.
ఔట్ జాబితా : కిమిడి మృణాళిని, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, రావెల కిషోర్ బాబు.







