చంద్రబాబు అరెస్ట్ ! ఏ కేసులో అంటే..?

టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును( Chandrababu ) పోలీసులు అరెస్ట్ చేశారు.నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్టు చేశారు.ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు చంద్రబాబుపై ఉండడంతో వాటిపై ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టిన సిఐడి అధికారులు చంద్రబాబుపై క్రైమ్ నెంబర్ 29/2021 కేసులో అరెస్టు చేసినట్లు సిఐడి పోలీసులు తెలిపారు.120 (b),166,167,418, 420,465, సెక్షన్ల కింద పోలీసులు అరెస్టు చేశారు.468, 471,409, 201,109,రెడ్ విత్ 34,37 సెక్షన్ల కింద పోలీసులు అరెస్ట్ చేశారు.సిఐడి చట్టంలోని 12,13(2) రెడ్ విత్ (1) (c)(d) సెక్షన్ ను పోలీసులు చంద్రబాబుపై నమోదు చేశారు.

 Chandrababu Arrested! Which Case Means, Tdp, Chandrababu, Jagan, Ysrcp, Ap Tdp,-TeluguStop.com
Telugu Ap Cid, Ap, Ap Tdp, Cap Skil, Chandrababu, Jagan, Ysrcp-Latest News - Tel

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం బయటకు రావడంతో టిడిపి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టింది.యువ గళం ( yuvagalam )పాదయాత్రలో ఉన్న నారా లోకేష్( Nara Lokesh ) చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా , పోలీసులు అడ్డుకున్నారు.ఇక చంద్రబాబు అరెస్టు చేయబోతున్నారని నిన్న మధ్యాహ్నం నుంచి మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.నంద్యాల చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి భారీగా పోలీసులు మోహరంచడంతో చంద్రబాబు అరెస్టు తప్పదనే సంకేతాలు వెలుపడ్డాయి .వాస్తవంగా అమరావతి వ్యవహారంలో 118 కోట్లు చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు చేస్తూ ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.ఈ కేసులోనే ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది.

అయితే ఐటీ శాఖ షోకాజ్ నోటీసు మాత్రమే ఇచ్చిన నేపథ్యంలో అరెస్టు చేసే అవకాశం లేదని అన్నమయ్య జిల్లా అంగళ్ల లో దాడి ఘటనలోనే ఆయన అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది .

Telugu Ap Cid, Ap, Ap Tdp, Cap Skil, Chandrababu, Jagan, Ysrcp-Latest News - Tel

అంగళ్లు ఘటనలు చంద్రబాబు ఏ 1 గా ఉండడం ఆయనపై హత్యాయత్నం కేసు సహా తీవ్ర  అభియోగాలు నమోదు అయ్యాయి.అయితే ఏపీ స్కిల్ డెవలప్మెంట్( AP Skill Development ) కేసులోనే ఈ ఆరెస్ట్ జరిగింది.ఈ కేసులో చంద్రబాబు ఏ 1 గా ఉన్నారు.

  అయితే ఈ అరెస్టు వ్యవహారంపై చంద్రబాబు స్పందించారు.ఈ కేసులో తన తప్పు ఉన్నట్లు ఆధారాలు ఉంటే ఉరితీయాలని పోలీసులతో చంద్రబాబు వ్యాఖ్యానించారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube