స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( State Bank of India ) ఇపుడు వాట్సప్ బ్యాంకింగ్ ద్వారా 15 పైగా సేవల్ని అందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.అందుకే ఎస్‌బీఐ అకౌంట్ హోల్డర్స్( SBI Account Holders ) ఏఏ సేవలు వాట్సప్‌లో పొందవచ్చో తెలుసుకోవడం అనేది తప్పనిసరి అయిపోయిందని గుర్తు పెట్టుకోండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలారోజుల క్రితమే ఈ వాట్సప్ బ్యాంకింగ్ సేవల్ని ప్రారంభించింది.కానీ చాలమందికి వీటిపైన అవగాహన లేకపోవడం గమనార్హం.
ఈ క్రమంలోనే మొదట ప్రయోగాత్మకంగా కేవలం 3 సేవల్ని మాత్రమే వాట్సప్ బ్యాంకింగ్ ద్వారా అందించింది ఎస్‌బీఐ.

ఇక రానురాను కస్టమర్ల నుంచి మంచి స్పందన రావడంతో ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్( SBI WhatsApp Banking ) ద్వారా అందించే సేవల్ని పెంచుతూ వస్తోంది.ప్రస్తుతం ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ కస్టమర్లకు ద్వారా 15 పైగా సేవలు లభిస్తున్నాయి అంటే మీరు నమ్ముతారా? చాలావరకు ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవల కోసం కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనిలేదు.కస్టమర్ కేర్‌కు కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
ఎస్‌బీఐ ఖాతాదారులు వాట్సప్ బ్యాంకింగ్ సేవల్ని పొందాలంటే ముందుగా తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.

ఇపుడు మీరు వాట్సప్ ద్వారా స్టేట్‌మెంట్ సర్వీసెస్, పెన్షన్ స్లిప్, లోన్ ప్రొడక్ట్స్ సమాచారం అంటే హోమ్ లోన్, గోల్డ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్- వడ్డీరేట్లు మొదలగు సందేహాలను తెలుసుకోవచ్చు.అదేవిధంగా డిపాజిట్ ప్రొడక్ట్స్ సమాచారం అంటే సేవింగ్స్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్-ఫీచర్స్, వడ్డీ రేట్లు కూడా తెలుసుకోవచ్చు.అదేవిధంగా ఎన్ఆర్ఐ సేవలు అనగా ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్, FAQ, ఫీచర్స్, వడ్డీ రేట్లు, డిజిటల్ బ్యాంకింగ్, దగ్గర్లోని ఏటీఎం లేదా బ్రాంచ్ సెర్చ్, మరిన్ని సేవలు, సెషన్ క్లోజ్, డీరిజిస్టర్ లాంటి ఆప్షన్స్ మీరు తెలుసుకోవచ్చు.







