మోడీని అడ్డదిడ్డంగా ఇరికించేస్తున్న బాబు ? ఇరకాటంలో బీజేపీ ?

సమయానుకూలంగా రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు తమ నిర్ణయాలను అభిప్రాయాలను, మార్చుకుంటూ ఉంటారు.

ఎప్పుడు ఒకే మాటకు కట్టుబడి ఉంటే రాజకీయాలు చేయలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.

అన్ని రాజకీయ పార్టీల నేతలు ఇదే వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు.ఇక విషయానికి వస్తే, అమరావతి ఉద్యమం ఏపీలో ఇప్పుడు ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది.

ఇప్పటికే రాజధాని పరిసర ప్రాంత ప్రజలు చేపట్టిన ఉద్యమం 200 రోజులు దాటిపోయింది.ఎక్కడా ఈ ఉద్యమాన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అపేదే లేదన్నట్టుగా ముందుకు నడిపిస్తున్నారు.

ఇక ఈ అంశంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరికించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.అయితే కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రమే ఈ వ్యవహారంలో గెలిపిస్తే పెద్దగా ఉపయోగం లేదని, రాజధాని ఉద్యమానికి మరింత ఊపు తీసుకురావాలనే అభిప్రాయంతో ఉన్న చంద్రబాబు, అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తయిన సందర్భంగా, చేసిన ప్రసంగం చూస్తే ఈ వ్యవహారంలో బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని ఇరికించే విధంగా మాట్లాడారు.

Advertisement

అమరావతి ఉద్యమంలోకి మోదీని తీసుకు రావడం వల్ల వైసీపీని కూడా ఇబ్బంది పెట్టొచ్చు అనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది.

అందుకే గతంలో అమరావతి లో రాజధాని నిర్మాణానికి మద్దతుగా మోడీ మాట్లాడిన మాటలను, ఇచ్చిన హామీలను చంద్రబాబు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు.2014 ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ కంటే మెరుగైన రాజధానిని ఏపీలో నిర్మిస్తామని చెప్పిన మాటలను, అమరావతిలో రాజధాని నిర్మాణం శంకుస్థాపన సందర్భంగా పార్లమెంట్ ఆవరణంలోని మట్టిని , యమునా నీళ్లను తీసుకొచ్చి మరి అండగా ఉంటామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.ఇప్పుడు అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని, అప్పట్లో మీరు ఇచ్చిన హామీలు కూడా ఈ ప్రభుత్వం నెరవేరకుండా చేస్తోంది అని, అందుకే అమరావతిని కాపాడాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపైనే ఉందంటూ ఈ వ్యవహారాన్ని బీజేపీ కి తగిలించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఒకపక్క ఈ వ్యవహారంలో బిజెపి ప్రభుత్వం ను ఇన్వాల్ చేస్తూ వైసీపీని కూడా లాగుతోంది.అమరావతి అంటే ప్రధాని మోడీ కి చాలా ప్రేమ ఉందని, కానీ జగన్ దానిని అడ్డుకోవాలని చూస్తున్నారని, మోడీ ఇచ్చిన హామీలను జగన్ నెరవేరకుండా చేస్తున్నారని, బీజేపీ రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ దూకుడును అడ్డుకోవాలంటే కేంద్రం కలగ చేసుకోవాలన్నది చంద్రబాబు అభిప్రాయంగా కనిపిస్తోంది.అందుకే ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ వ్యవహారంలోకి లాగి రాజకీయం గా లబ్ధి పొందాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు