కాజల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మునప్పటి జోరు కనపరిచేనా?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మరో సారి తన జోరు కంటిన్యూ చేయబోతున్నట్లుగా తాజా పరిణామాలను చూస్తుంటే అనిపిస్తోంది.ముద్దు గుమ్మ పెళ్లి పిల్లలు తర్వాత సినిమా లకు దూరం అవుతుందని అంతా భావించారు, కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమా లను కమిట్ అయింది.

 Chandamama Kajal Agarwal New Films Back To Back Details, Chandamama, Chiranjeevi-TeluguStop.com

తమిళం లో ఇప్పటికే ఇండియన్ 2 సినిమా ను చేస్తున్న కాజల్ అగర్వాల్ అతి త్వరలోనే మరో తమిళ స్టార్ హీరో సినిమా లో కూడా నటించేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది.అందుకు సంబంధించిన చర్చలు ఇటీవలే పూర్తి అయ్యాయి అంటూ తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇక తెలుగు లో కూడా ఈమె ఒక సీనియర్ స్టార్ హీరో కు జోడి గా పరిశీలింపబడుతోందని, ఆయన తో గతం లో ఒకటి రెండు సినిమాల్లో కూడా కాజల్ నటించింది.కనుక తప్పకుండా వీరిద్దరి జోడి బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ప్రస్తుతం ఈమె అమ్మ అయింది.కనుక కాజల్ అగర్వాల్ తో యంగ్ హీరోలు నటించే అవకాశం లేదు.

వాళ్ళు ఆసక్తి చూపించే అవకాశం అంత కన్నా లేదు, కనుక సీనియర్ స్టార్ హీరోలను లైన్ లో పెట్టి కాజల్ అగర్వాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Telugu Chandamama, Chiranjeevi, Kajal Agarwal, Indian, Kamal Hasan, Telugu-Movie

చందమామ సినిమా తో టాలీవుడ్ లో మంచి పేరుని దక్కించుకొని మగధీర సినిమా తో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా నిలిచింది.దాదాపు దశాబ్ద కాలం పాటు కాజల్ అగర్వాల్ నెంబర్ 1 హీరోయిన్ గా నిలిచింది.యంగ్ స్టార్ హీరోలు అందరితో కూడా కాజల్ అగర్వాల్ సినిమాలు చేసి మరే హీరోయిన్ కి దక్కని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

తండ్రీ కొడుకులతో జోడిగా హీరోయిన్ గా నటించిన అరుదైన ఘనత ను కూడా ఈమె సొంతం చేసుకుంది.చిరంజీవికి మరి రాంచరణ్ కి జోడిగా నటించిన కాజల్ అగర్వాల్ ముందు ముందు మరిన్ని సినిమాలను చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube