ఊసరవెల్లులు( Chameleon ) రంగులను మార్చగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.ఏ పరిసరాల్లోనైనా కలిసిపోగల శక్తి వీటి సొంతం.
చెట్టు ఎక్కితే చెట్టు లాగా ఇది మారిపోతుంది.అదే ఏదైనా రాయి పైకి ఎక్కితే రాయిలో కలిసిపోతుంది.
దీనివల్ల ఇతర జీవులు దీనిని కనిపెట్టలేవు.ఫలితంగా ఇది తన ప్రాణాలను కాపాడుకుంటుంది.
అయితే తాజాగా ఒక ఊసరవెల్లి రంగురంగుల పెన్సిళ్లను ఎక్కుతూ చాలా వేగంతో తన రంగును మార్చుకుంది.దీనికి సంబంధించిన ఒక వీడియో ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది.
ఈ క్లిప్‌ను @Great Videos అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.“అద్భుతమైన వేగంతో రంగును( Colors ) మార్చే ఊసరవెల్లి” అని దీనికి ఒక క్యాప్షన్ ఇచ్చింది.45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో వైరల్‌గా మారింది.ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి.
చాలా మంది ట్విటర్ యూజర్లు ఊసరవెల్లి రంగు మార్చే సామర్థ్యాలపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఊసరవెల్లి తను పట్టుకున్న పెన్సిల్ రంగుకి( Pencil Color ) మిల్లి సెకన్‌లలోనే మారిపోవడం చూడవచ్చు.
ఇది చూసేందుకు చాలా ఆశ్చర్యం కలిగించింది.
ఈ సామర్థ్యం మాంసాహారుల నుంచి సురక్షితంగా ఉండటమే కాకుండా వాటిని పెంపుడు జంతువుగా కూడా చేస్తుంది.ఊసరవెల్లులు తమ చర్మ కణాలలోని వర్ణద్రవ్యాలను నియంత్రించడం ద్వారా వాటి రంగులను మారుస్తాయి, ఇది వాటి పరిసరాలతో కలిసిపోవడానికి సహాయపడుతుంది.అవి కొన్ని సెకన్లలో రంగులను మార్చగలవు, అప్పుడు వేటాడే జంతువులు వీటిని గుర్తించడం కష్టం అవుతుంది.
ఊసరవెల్లి రంగులు మార్చే సామర్థ్యం కమ్యూనికేషన్‌కు కూడా ఉపయోగించబడుతుంది.