చైనా చెరలో ఐదుగురు భారతీయులు అని సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే

ప్రస్తుతం భారత్ చైనా మధ్య యుద్ధవాతావరణం నెలకొంది.ఇలాంటి టైంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రధానికి రాసిన ఓ లేఖ ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది దాని కథేంటో ఇప్పుడు చూద్దాం.

 China Captured Five Indians,india, Chaina, Ninong Erong, Narendra Modi, Arunchal-TeluguStop.com

అరుణాచల్ ప్రదేశ్‌ సుబానాసిరి జిల్లాకు చెందిన ఐదుగురు భారతీయులను గుట్టు చప్పుడు కాకుండా చైనా (పి.ఎల్.ఎ) సైన్యం అపహరించిందని వారిని ఎలాగైనా సురక్షితంగా భారత్ కు తీసుకురావాలని ఇటువంటి దుస్సాహసాలు కు తెగిస్తున్న చైనాకు మనం సరైన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.

ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసిన లేఖలో ఇంతముందు కూడా అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో చైనా ఇలాంటి దారుణాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.

కరోనా టైంలో చైనా వివాదాలు సృష్టించిన ప్రాంతాలను స్వయంగా సందర్శించిన నరేంద్ర మోడీ తాజాగా బోర్డర్ రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే రాసిన లేఖపై ఎలా స్పందిస్తారో? ప్యాంగాంగ్ లేక్ వద్ద రోజురోజుకు ముదురుతున్న ఉద్రిక్తతలు ఎప్పుడు చల్లబడతాయో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube