ప్రస్తుత కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈరోజు హైదరాబాద్ కి వచ్చి పలు బీజేపీ ప్రముఖులతో కలవనున్నారు.కొన్ని రోజుల క్రితం రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కృష్ణంరాజు కుటుంబ సభ్యులను 16వ తేదీన పరామర్శించనున్నారు.ఇంకా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజకీయ భేటీ కానున్నారని రాజకీయ వర్గాల సమాచారం.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో అమిత్ షా కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని కేంద్ర రాజకీయ ప్రముఖుల అంచనా.ఎందుకంటే కొన్ని రోజుల క్రితం కేంద్ర మంత్రి అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కేంద్రమంత్రి రక్షణ శాఖ రాజ్ నాథ్ సింగ్ యంగ్ రెబల్ స్టార్ తో భేటీ అవ్వడానికి కారణం బీజేపీ ప్రభుత్వానికి కృష్ణంరాజు గారు ఎంతో సేవ చేయడమే.అందువల్లే కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా గారు కృష్ణం రాజు గారి కుటుంబాన్ని కలవడానికి వస్తున్నారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన రారాజు.అలా సినిమాలు చేస్తూనే బీజేపీ ప్రభుత్వం తరఫున ఎంపీగా ప్రజలకు సేవలు అందించారు.సెప్టెంబర్ 11వ తేదీన గచ్చిబౌలిలోని ఒక ఆసుపత్రిలో అనారోగ్యంతో కృష్ణంరాజు గారు చికిత్స పొందుతూ మృతి చెందారు.ఆయన మృతి చెందడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు.
ఆయన మృతి చెందిన విషయం ఆయన అభిమానులకు తెలియడంతో వారందరూ సోషల్ మీడియా వేదికగా బాధపడుతూ కామెంట్లు చేశారు.







