జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించేందుకు కేంద్రం నియమించిన కమిటీ ఇవాళ తెలంగాణకు రానుంది.
కేంద్రం జలవనరుల శాఖ సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు బ్యారేజ్ ను పరిశీలించిన నివేదిక అందించాలని కమిటీకి కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.ఈ నేపథ్యంలో బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని కమిటీ పరిశీలించనుంది.
కాగా బ్యారేజ్ మూడు నుంచి నాలుగు ఫీట్ల మేర కిందకు కుంగినట్లు తెలుస్తోంది.మరోవైపు మేడిగడ్డ బ్యారేజీపై ఎల్ అండ్ టీ ఇప్పటికే కీలక ప్రకటన చేసింది.
బ్యారేజ్ ను రాష్ట్ర ఇంజినీర్ల డిజైన్ మేరకే నిర్మించామన్న ఎల్ అండ్ టీ ఐదు వరద సీజన్లను బ్యారేజ్ తట్టుకుందని తెలిపింది.







