ప్రతి విషయంలో కేంద్రంలోని బీజేపీకి మద్దతిస్తున్న వైసీపీకి తాజాగా గట్టి షాక్ తగిలింది. ఏపీ సర్కార్ కేంద్రానికి పంపిన ఓ ప్రతిపాదనను పక్కన పెట్టేయడం చర్చకు దారితీస్తోంది.
ఇన్నాళ్ల దోస్తీ ఇంతేనా అంటున్నారు.మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం కేంద్రంతో మంచి దోస్తీ చేస్తోంది.
బీజేపీ నేతలు ఏం మాట్లాడినా మద్దతు ఇస్తుంటారు.ఇక కేంద్రాన్ని ఓ రేంజ్ లో పొగుడుతుంటారు.
బీజేపీ నేతలకంటే కూడా ఎక్కువగా సపోర్ట్ ఇస్తుంటారు.కాగా ఇటీవల కేంద్రం ఏపీ రాజధాని అంశంపై మాట్లాడిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఏపీలో రాజధానుల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుందని, ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు.
అయితే రాజధాని విషయంలో టీడీపీ కేంద్రం వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తోందిని జీవీఎల్ మండిపడ్డారు.
ఈ క్రమంలో టీడీపీ నేతలు సైతం జీవీఎల్ మీద ఫైర్ అయ్యారు.
వైసీపీ ఏజెంట్ అని ఆరోపించారు.ఈ వ్యాఖ్యలకు తగ్గట్టే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జీవీఎల్ నరసింహారావును వెనకేసుకొచ్చే వ్యాఖ్యలు చేశారు.
రాజధానిపై వివరణ ఇచ్చినందుకుగాను బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధానిపై జోక్యం చేసుకోమని కేంద్రం వెల్లడించినా టీడీపీ మాత్రం కేంద్రం ఎలాగైనా మూడు రాజధానులను అడ్డుకోవాలని కోరుకుంటోందని ఆయన విమర్శలు గుప్పించారు.
ఇతంటి దోస్తో చేసిన వైసీపీకి ఎందుకు కేంద్రం ఝలక్ ఇచ్చిందనేది ప్రశ్న.

ప్రతిపాదనను పక్కన పెట్టేసిందిగా.ఆ షాక్ ఏంటంటే… ఏపీలో బీచ్ సాండ్ మైనింగ్ కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని అనుమతి కోరితే నో అని చెప్పడమే.దీంతో పెద్ద ఎత్తున చర్చగా జరుగుతోంది.
బీచ్ సాండ్ నుంచి అణు ఇంధనాని కి అవసరమైన మోనోటైజ్ ని పెద్ద ఎత్తున తవ్వితీస్తున్నారని దాన్ని అక్రమంగా విదేశాలకు పంపించి భారీ ఎత్తున ఎగుమతులు చేస్తున్నారు అన్న ఆరోపణలు ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం పేర్కొనడం విశేషం.అంతే కాదు ఫిర్యాదుల మీద అణు ఇంధన శాఖ సూచనలతో దర్యాప్తు చేపట్టాలని బ్యూరో ఆఫ్ మైన్స్ కి ఆదేశాలను కూడా కేంద్రం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అలాగే గనుల శాఖకు కూడా సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.ఈ అంశాలన్నీ కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు.అరె.ఇంత దోస్తాని చేస్తే ఈ ఒక్క ప్రతిపాదనను కూడా పక్కన పెట్టేస్తారా.అంటున్నారు.అయితే బీజేపీ ఏపీలో వైసీపీతో ఆటమొదలు పెట్టిందని అంటున్నారు.ఇక మరోపక్క టీడీపీ కూడా బీజేపీకి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.