తాజాగా కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ త్రిషపై సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఇతడు త్రిషపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసాడు.
అసలు ఒక సీనియర్ యాక్టర్ అయిఉండి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడంపై సెలెబ్రిటీల నుండి సాధారణ ప్రజల వరకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇంతకీ త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే అందరికి తెలిసే ఉంటుంది.
ఇతడు లియో సినిమాలో కీలక రోల్ ప్లే చేసాడు.స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో నటించిన మూవీ లియో.
ఈ సినిమాలో విజయ్ కు జోడీగా త్రిష హీరోయిన్ గా నటించింది.మరి ఈ సినిమా సమయంలో మన్సూర్ అలీ అనుకున్న మాటలు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.త్రిషతో రేప్ సన్నివేశం ఉంటుందని అనుకున్నాను అని కానీ అలాంటిది ఏమీ పెట్టలేదని.ఇలాంటి సీన్స్ నాకు కొత్త కాదు.కానీ కాశ్మీర్ షూట్ మొత్తం త్రిషను నాకు చూపించనే లేదని అసభ్యకర వ్యాఖ్యలు చేసాడు.
ఈ వ్యాఖ్యలపై తమిళ్ సెలెబ్రిటీలు మొత్తం ఫైర్ అవుతున్నారు.లియోలో నటించిన స్టార్స్ తో పాటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇతడి ఏకిపారేశారు.ఇక ఈ వివాదం మరింత ముదురుతోంది.
తాజాగా మాళవిక మోహనన్ కూడా ఇతడి వ్యాఖ్యలపై కామెంట్స్ చేసింది.అలాగే కార్తీక్ సుబ్బరాజు కూడా తలదించుకునేలా చేసాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు.
మరి తమిళ్ ఫెడరేషన్ ఎమన్నా యాక్షన్ తీసుకుంటుందేమో చూడాలి.