బ్రేకప్ తర్వాత షాకింగ్ కామెంట్స్ చేసిన సెల్రబిటీలు ఎవరో తెలుసా?

అవసరం ఉన్నంత సేపు ఓడ మల్లన్న.అవసరం తీరాక బోడి మల్లన్న.

కొందరు బాలీవుడ్ హీరోయిన్ల తీరు కూడా సేమ్ ఇలాగే ఉంది.

పలువురు హీరోలతో రిలేషన్ షిప్ ఎంజాయ్ చేసిన నటీమణులు.

కొన్ని కారణాలతో వారితో విడిపోయారు.ఆ తర్వాత వారితో కలిసి ఉన్నంత కాలం కష్టాలు పడ్డామంటూ మొసలి కన్నీళ్లు కార్చారు.

ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

హృతిక్- కంగనా

అప్పట్లో వీరిద్దరు ఓ రేంజిలో ప్రేమాయణం నడిపారు.

Advertisement

వీరి మధ్య ఎక్కడ చెడిందో తెలియదు కానీ.ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.

తమ గురించి వచ్చిన రూమర్స్ పైనా కంగా రుసరుసలాడింది.ఈ రూమర్స్ అన్నీ సిల్లీ థింగ్స్ అంటూ మండిపడింది.

క్లోజ్ అయిన చాప్టర్ గురంచి మళ్లీ చర్చించాలి అనుకోవడం లేదని చెప్పింది.

సాజిద్ ఖాన్ - జాక్వెలిన్ ఫెర్నాండేజ్

వీరు కూడా ఒకప్పుడు చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగారు.అనంతరం బ్రేకప్ అయ్యారు.అంతేకాదు.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
ఆ విషయంలో నిజంగానే చాలా కోపం వస్తుంది... అసలు విషయం బయటపెట్టిన దేవిశ్రీ!

ఆ తర్వాత సాజిద్ పై జాక్వెలిన్ పలుమార్లు కామెంట్స్ చేసింది.హిమ్మత్ వాలా సినిమా చేస్తున్నప్పుడు సాజిద్ తో కలిసి 5 రోజులు హాలీడేకు వెళ్లినట్లు చెప్పింది.

Advertisement

ఆ తర్వాత ఎందుకు వెళ్లానా అని బాధపడినట్లు వెల్లడించింది.

షాహిద్ కపూర్ - కరీనా కపూర్

వీరిద్దరు కలిసి నాలుగున్నరేళ్లు రిలేషన్ లో ఉన్నారు.ఆ తర్వాత విడిపోయారు.అదే సమయంలో మళ్లీ కరీనాతో కలిసి సినిమా చేస్తారా? అని షాహిద్ ను అడిగారు.తాను చేసే దర్శకుడు బర్రెతో చేయమన్నా చేస్తానని చెప్పాడు.

నాలుగున్నర ఏండ్ల రిలేషన్ షిప్ లో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నట్లు చెప్పాడు.ఇప్పుడు తన తీరుపూర్తిగా మారిపోయిందని చెప్పాడు.

ఐశ్వర్యారాయ్ - సల్మాన్ ఖాన్

వీరిద్దరు కూడా ఒకప్పుడు బాగానే తిరిగారు.ఆ తర్వాత బ్రేకప్ అయ్యారు.బ్రేకప్ తర్వాత సల్మాన్ తనకు ఫోన్ చేసి పిచ్చిగా మాట్లాడేవాడని చెప్పింది.

కో స్టార్ తో నాకు అఫైర్ ఉందని అనుమానించేవాడని చెప్పింది.కొన్నిసార్లు తను దురుసుగా ప్రవర్తించేవాడని చెప్పింది.

తను చాలా ఇబ్బంది పెట్టాడంది.ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే తనతో బ్రేకప్ అయినట్లు వెల్లడించింది.

సైఫ్ అలీ ఖాన్ – అమృతా సింగ్

వీరిద్దరు మూడేండ్లు కలిసి ఉన్నారు.అనంతరం విడాకులు తీసుకున్నారు.సైఫ్ తన తల్లితో పాటు చెల్లిని ఎగతాళి చేసేవాడని చెప్పింది అమృతా సింగ్ .అందుకే తన నుంచి దూరం అయినట్లు వెల్లడించింది.

తాజా వార్తలు