కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయనకు తమిళ్ లో రజనీకాంత్ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు.
ఈయన సినిమా లంటే అక్కడి ప్రేక్షకులు పడి చచ్చిపోతారు.ఈయన గత సినిమా మాస్టర్ 200 కోట్లు వసూలు చేసి కోలీవుడ్ లో సంచలనం నమోదు చేసింది.
ఇక ఇప్పుడు ఈయన బీస్ట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి రిలీజ్ కు కూడా రెడీగా ఉంచారు.ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించాడు.
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసారు.

ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్ లోకి వచ్చింది. అనిరుద్ సంగీతం అంధించిన ఈ సినిమా నుండి వచ్చిన సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసాయి.దీంతో ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.
సామాన్య ప్రేక్షకులు సైతం ఎదురు చూసారు.ఇక ఈ సినిమా థియేటర్ లోకి రావడంతో సందడి మొదలయ్యింది.
అభిమానులు అన్నాకా ఆ మాత్రం సందడి చేయకపోతే ఎలా.ఇప్పుడు విజయ్ బీస్ట్ సినిమా పరిస్థితి కూడా ఇలానే ఉంది.ఆయన అభిమానులు థియేటర్ దగ్గర మాములు రచ్చ చేయడం లేదు.ఫ్యాన్స్ మాత్రమే కాదు. సెలెబ్రిటీలు సైతం ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఆసక్తిగా ఉన్నారు.తాజాగా బీస్ట్ సినిమా చూసేందుకు సెలెబ్రిటీలు క్యూ కట్టారు.

బీస్ట్ టీమ్ తో పాటు ఈ సినిమా చూడడానికి పూజా హెగ్డే, అపర్ణా దాస్, అనిరుద్ రవిచందర్, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి వారితో పాటు కీర్తి సురేష్, ప్రియాంక అరుళ్ మోహన్ వంటి వారు బీస్ట్ సినిమా ఫస్ట్ డే రోజు ఫస్ట్ షో చూడడానికి థియేటర్ కు వచ్చి సందడి చేసారు.ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.







