బాబు గారు ఎన్టీఆర్‌కు ఎందుకు బర్త్‌డే విషెస్‌ చెప్పలేదు?

నిన్న మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా కొన్ని లక్షల మంది ఆయనకు సోషల్‌ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెల్సిందే.

అయితే చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్‌ చేసిన ట్వీట్స్‌ మాత్రం చర్చనీయాంశం అయ్యాయి.

మహేష్‌బాబు ఫ్యాన్స్‌ను సంతృప్తి పర్చేందుకు లేదంటే వారి పార్టీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్‌ను సంతృప్తి పర్చేందుకు తండ్రి కొడుకులు మహేష్‌బాబుకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేశారు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.ఈ సమయంలోనే మరికొందరు ఎన్టీఆర్‌ విషయాన్ని తీసుకు వస్తున్న నేపథ్యంలో పరిస్థితి రచ్చకు దారి తీసింది.

Chandrababu Wishesh Mahesh Babu On Birthday, Chandra Babu Twitter, NTR,-బా�

రెండు నెలల క్రితం ఎన్టీఆర్‌ బర్త్‌డే వచ్చింది.ఆ రోజు కనీసం విషెస్‌ చెప్పని చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్‌ ఈసారి మహేష్‌బాబుకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పాల్సి వచ్చింది అంటూ ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు గారు మీకు ఎందుకు ఎన్టీఆర్‌ విషయంలో పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు.మీరు ఆయన్ను పక్కన పెట్టడం వల్ల మీకే నష్టం అనే విషయాన్ని మీరు గుర్తించడం లేదు అంటూ కొందరు ట్విట్టర్ లో ప్రశ్నిస్తున్నారు.

Advertisement

ఎన్‌టి‌ఆర్ ను మీరు ఎంతగా దూరం పెట్టినా కూడా మీరు భయపడుతున్నది జరగడం ఖాయం అంటూ మరి కొందరు హెచ్చరించారు.మొత్తానికి తండ్రి కొడుకులు అడ్డంగా బుక్ అయ్యారు.

తగ్గేదెలా.. వెస్టిండీస్ బౌలర్ పై కాలు దువ్విన యువరాజ్ సింగ్
Advertisement

తాజా వార్తలు