ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు ఈడీ అధికారులు చేర్చడం తెలిసిందే.ఈ కేసులో కవిత పేరు అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించటం జరిగింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి కమిషన్ ల కోసమే ఢిల్లీ లిక్కర్ పాలసీలు అత్యధికంగా మార్టిన్ పెట్టారని… అందులో ఆరోపించడం జరిగింది.ఈ క్రమంలో తాజాగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకి సంబంధించి ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టించింది.
ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి లెక్కలపై సీబీఐ ఆరా తీయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే విచారణకు సంబంధించి ఢిల్లీ లేదా హైదరాబాద్ సీబీఐ కార్యాలయాల్లో ఎక్కడైనా హాజరు కావచ్చు అని నోటీసులో పేర్కొనడం జరిగింది.
ఈ క్రమంలో ఈ నెల ఆరవ తారీఖున హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి.







