సీబీఐ ఉద్యోగులకు కొత్త డైరెక్ట‌ర్ ఆదేశాలు.. !

ఇటీవల సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్ నియమితుడైన విష‌యం తెలిసిందే.అయితే ఈయన చార్జ్ తీసుకోవడం ఆలస్యం సీబీఐ అధికారులు ధరించే దుస్తుల విషయంలో కీలక ఆదేశాలు జారి చేయడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 Cbi New Director Subodh Kumar Jaiswal New Rules For Cbi Employees, Cbi, New Dire-TeluguStop.com

ఇదివరకు విధినిర్వహణలో ఎలాంటి డ్రెస్‌లు వేసుకున్నారో అనవసరం కానీ ఇప్పటి నుండి అధికారులతో పాటుగా, ఇత‌ర సిబ్బంది కూడా ఫార్మ‌ల్ డ్రెస్ వేసుకునే రావాల‌ని, జీన్స్‌, స్పోర్ట్ షూలు వంటివి వేసుకుని వ‌స్తే ఉపేక్షించ‌బోన‌ని సీబీఐ కొత్త డైరెక్టర్‌ పేర్కొనడం గ‌మ‌నార్హం.ఇకపోతే సీబీఐలో ప‌నిచేస్తోన్న మ‌హిళాధికారులు చీర‌లు, సాధార‌ణ చొక్కాలు, సూటు, బూట్లు వేసుకుని రావాలని, పురుషులు అయితే చ‌క్క‌గా షేవింగ్ చేసుకుని, ఫార్మ‌ల్ చొక్కాలు, ప్యాంట్లు, బూట్లు వేసుకుని విధుల‌కు రావాలని ఆదేశాలిచ్చారు.

కాగా ఈ నిబంధ‌ల‌ను దేశ వ్యాప్తంగా సీబీఐ సిబ్బంది క‌చ్చితంగా పాటించాల్సిందేన‌ని పేర్కొన్నారు.ఇన్నాళ్లుగా ఈ నిబంధనలు పాటించని సీబీఐ అధికారులు ఇప్పుడు సడెన్‌గా మారుతారో లేరో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube