ఇటీవల సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితుడైన విషయం తెలిసిందే.అయితే ఈయన చార్జ్ తీసుకోవడం ఆలస్యం సీబీఐ అధికారులు ధరించే దుస్తుల విషయంలో కీలక ఆదేశాలు జారి చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇదివరకు విధినిర్వహణలో ఎలాంటి డ్రెస్‌లు వేసుకున్నారో అనవసరం కానీ ఇప్పటి నుండి అధికారులతో పాటుగా, ఇతర సిబ్బంది కూడా ఫార్మల్ డ్రెస్ వేసుకునే రావాలని, జీన్స్, స్పోర్ట్ షూలు వంటివి వేసుకుని వస్తే ఉపేక్షించబోనని సీబీఐ కొత్త డైరెక్టర్ పేర్కొనడం గమనార్హం.