పిల్లులు కుక్కల కంటే కాస్త తెలివైనవని చెప్పవచ్చు.ఎందుకంటే వీటికి కుక్కల్లో కంటే కూడా ఎక్కువగా ఉత్సుకత ఉంటుంది.
ఈ పిల్లులు తన చుట్టుపక్కల పరిసరాలలో ఉన్న అన్ని వస్తువులను గమనిస్తున్నాయి.అదేంటి? వాటి వల్ల తనకు ఏదైనా ప్రమాదం జరుగుతుందా? అని ఒక సైంటిస్ట్ లాగా ఇవి పరిశోధనలు కూడా చేస్తాయి.ఆ స్వభావం మీ పిల్లుల మనుగడకు, సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది.
అయితే తాజాగా రెండు పిల్లులు ఒక కిచెన్ పరికరం చూసి బాగా ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.
అదేంటని పరిశీలించేందుకు చాలా ప్రయత్నించాయి.దాన్ని గుండ్రంగా తిప్పుతూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ చూపరులను కట్టిపడేస్తాయి.
దీనికి సంబంధించిన వీడియోని ప్యూబిటీ అనే ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.ఈ చిన్న వీడియో క్లిప్‌కి ఇప్పటికే రెండు లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో రెండు పిల్లులు కిచెన్‌లో ఒక బల్లపై కూర్చోవడం చూడవచ్చు.ఆ బల్ల మీద ఒక ఫ్రైయింగ్ ప్యాన్ ఉంది.ఏదైనా ఫ్రై చేసుకోవడానికి ఇంకా తదితర వంటలు వండుకోవడానికి ఈ పాత్రను ప్రజలు వాడుతుంటారు.అయితే పిల్లులు మాత్రం దీనిని తమ ఆట వస్తువు లాగా మార్చుకున్నాయి.
దాని హ్యాండిల్‌ను చేతితో తాకుతూ దాన్ని గుండ్రంగా తిప్పుతూ ఎంజాయ్ చేశాయి.చిన్నపిల్లలు ఏదో గిరక ఆట ఆడినట్టు ఇవి ఆడుకుంటూ కనిపించాయి.
ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.వావ్, ఈ దృశ్యం చూసేందుకు సూపర్ గా ఉంది అని ఇంకొందరు ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు కామెంట్ పెడుతున్నారు.
ఈ క్యూట్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.







